Nayanthara: వయసు 41.. లుక్స్‌ 21.. తప్పక తెలుసుకోవాల్సిన ఫిట్​నెస్‌, గ్లోయింగ్‌ రహస్యాలు

సూపర్‌‌స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నయనతార.. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. గ్లామర్ పాత్రలు, ఎమోషనల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్‌గా ఉంది నయన్. బాలీవుడ్‌లో భారీ విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా.. 

Nayanthara: వయసు 41.. లుక్స్‌ 21.. తప్పక తెలుసుకోవాల్సిన ఫిట్​నెస్‌, గ్లోయింగ్‌ రహస్యాలు
ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్. ఈ సినిమాలలో ఆమె తన పారితోషికాన్ని కూడా త్యాగం చేసి నటించడం.. మరోవైపు కమర్షియల్ సినిమాల్లో ముక్కుపిండి మరీ రెమ్యునరేషన్ వసూలు చేయడం నయన్ స్టైల్. ఇదే ఆమె స్టార్‌డమ్‌ను మరింత పెంచుతున్నాయి.

Updated on: Nov 17, 2025 | 7:31 PM

సూపర్‌‌స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నయనతార.. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్‌తోపాటు వేరే భాషల్లోని సినీ ప్రేమికులను కూడా అలరిస్తున్న నయన్ ఇప్పటికీ అదే యంగ్ లుక్‌తో అలరిస్తోంది.

గ్లామర్ పాత్రలు, ఎమోషనల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్‌గా ఉంది నయన్. బాలీవుడ్‌లో భారీ విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటూ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది. యాక్షన్ సీన్స్‌లోనూ తనదైన శైలిలో నటిస్తూ ఆకట్టుకుంటోంది లేడీ సూపర్‌స్టార్.

ఎప్పుడూ యంగ్, ఎనర్జిటిక్, టోన్డ్ ఫిట్‌నెస్‌తో కనిపిస్తుంది. ‘జవాన్’, ‘అన్నపూర్ణి’, ‘టెస్ట్’ వంటి సినిమాల్లో ఆమె ఫిజికల్ స్టామినా, గ్లోయింగ్ స్కిన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫిట్‌నెస్ వెనుక ఆమె డిసిప్లిన్డ్ లైఫ్‌స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్, మైండ్‌ఫుల్ వర్కౌట్స్ ఉన్నాయి.

బ్యాలెన్స్డ్,  హోమ్‌మేడ్ డైట్

డైట్ అంటే రెస్ట్రిక్షన్స్ అనుకునేది నయన్ ఒకప్పుడు. ఆనందంగా తిను, గిల్ట్ ఫ్రీగా ఉండు. అనేది ఆమె సీక్రెట్. హై ప్రోటీన్, హై ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్‌తో నిండిన ఇంటి ఆహారమే ఆమె ఫేవరెట్. జంక్ ఫుడ్ క్రేవింగ్స్ పూర్తిగా దూరమయ్యాయని చెబుతుంది.

ప్రతిరోజూ గంటన్నర వర్కౌట్స్..

షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా వర్కౌట్ మిస్ చేయదు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, పిలాటెస్, కార్డియో తప్పకుండా చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటుంది. అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెస్ రిలీఫ్, మైండ్-బాడీ కనెక్షన్ కోసం యోగా తప్పనిసరి అని చెబుతుంది నయన్. బిజీ షెడ్యూల్‌లోనూ ప్రశాంతంగా ఉండేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని నొక్కి చెబుతుంది.

మెంటల్ వెల్‌బీయింగ్

ఫిట్‌నెస్ అంటే శరీరం మాత్రమే కాదు, మనసు కూడా అంటుంది నయనతార. ఒత్తిడి తగ్గించుకోవడం, పాజిటివ్ మైండ్‌సెట్ బ్యాలెన్స్‌ చేసుకోవడం పాటించడం ప్రతిరోజూ ఆమె రొటీన్‌ కార్యక్రమాల్లో భాగం. “ఆరోగ్యకరమైన ఆహారం మనసుకూ ఆనందాన్ని ఇస్తుంది” అని నమ్ముతుంది.

సరైన నిద్ర

లాంగ్ షూటింగ్ షెడ్యూల్స్, ఇంటెన్స్ సీన్స్ ఉన్నా సరైన నిద్రను ఎప్పుడూ కాంప్రమైజ్ చేయనని చెబుతుంది నయనతార. వర్కౌట్ తర్వాత కండరాలు, బాడీ రిలాక్స్ కావడానికి, ఎనర్జీ రీచార్జ్‌కి నిద్ర అత్యంత కీలకమని నమ్ముతుంది ఈ బ్యూటీ.  ఇవే 41 ఏళ్ల వయసులోనూ యంగ్, ఎనర్జిటిక్‌గా ఉండే నయన్‌తార సీక్రెట్స్. “స్టే హెల్తీ, స్టే హ్యాపీ” అని ఆమె ఇచ్చే మెసేజ్ అందరికీ ఇన్‌స్పిరేషన్.