
ఒక ప్రశాంతమైన అడవిలో అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సు ఒడ్డున పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టుపై కాకులు, పిచ్చుకలు, చిలుకలు, పావురాలు వంటి ఎన్నో పక్షులు గూళ్లు కట్టుకుని తమ పిల్లలతో ఆనందంగా జీవించేవి. జంతువులు అక్కడికి నీళ్లు తాగేందుకు వచ్చేవి. చెట్టు కింద ఉన్న పుట్టలో ఒక పెద్ద నల్ల నాగుపాము నివసించేది. అది చాలా క్రూరమైనది, దురాశగలది. ప్రతి సంవత్సరం పక్షులు గుడ్లు పెట్టి పిల్లలను పెంచడం ప్రారంభించగానే, పాము వాటిపై కన్నేసేది. పక్షులు ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో చెట్టెక్కి గూళ్లలోని గుడ్లను, చిన్న పిల్లలను తినేసేది. సాయంత్రం తిరిగి వచ్చిన పక్షులు తమ గూళ్లు ఖాళీగా కనిపించడంతో తీవ్రంగా విలపించేవి. మొదట పక్షులు గాలివాన వల్ల పిల్లలు పడిపోయి ఉంటారని అనుకున్నాయి. కానీ రోజులు గడిచేకొద్దీ అదే సంఘటన మళ్లీ మళ్లీ జరగడంతో ఎవరో తమ పిల్లలను తింటున్నారని గ్రహించాయి. ఒక రోజు కొన్ని పక్షులు దాక్కుని గమనించగా, చెట్టు కింద ఉన్న పుట్ట నుంచి నాగుపాము బయటకు వచ్చి గూళ్లను నాశనం చేస్తోందని తెలుసుకున్నాయి.
పక్షులన్నీ కలిసి సమావేశమయ్యాయి. కొందరు మరో చెట్టుకు వెళ్లిపోదామని చెప్పారు. మరికొందరు పాముతో పోరాడుదామని అన్నారు. కానీ ఎవరికీ సరైన పరిష్కారం కనిపించలేదు. ఎందుకంటే పాము విషపూరితమైనది, దానితో పోరాడటం చాలా ప్రమాదకరం. అదే సరస్సులో ఒక తెలివైన బాతు దంపతులు ఉండేవి. అందులో ఆడ బాతు చెరువు గట్టున రెండు గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను అక్కడే వదిలేసి మర్నాడు బాతు దంపతులు చెరువులో ఆహారం కోసం వెళ్లాయి. అక్కడే నక్కి ఉన్న పాము వెంటనే ఆ గుడ్లు దగ్గరకు వెళ్లి రెండు గుడ్లు తినేసింది. ఆ తర్వాత తన పుట్టలో దాక్కుంది. బాతు జంట గూటికి తిరిగొచ్చి.. తమ గుడ్లు కనిపించకపోవడంతో కంగారు పడ్డాయి. గూడులోని గుడ్లను మిగిలిన బాతులు మాత్రమే చూశాయని, అవే గుడ్లు మాయం చేసి ఉంటాయని ఆడ బాతు బాధపడింది.
అయితే మగ బాతు ఈ పని ఎవరి చేశారో తెలుసుకునేందుకు ఓ ఐడియా చెప్పింది. మరుసటి రోజు ఆడ బాతు మరో రెండు గుడ్లు పెట్టింది. రోజంతా ఇద్దరూ గుడ్లకు కాపలా ఉన్నారు. సాయంత్రం ఆకలిగా ఉండటంతో ఆహారం కోసం వెళ్లేటప్పుడు గడ్డి తీసుకొచ్చి గుడ్లపై కప్పిఉంచి వెళ్లిపోయాయి. ఇదే అదనుగా పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి ఇలాంటి ఉపాయాలతో నన్ను మోసం చేయలేరంటే ఆబగా గుడ్లను తినసాగింది. అయితే ఆహారం వేటకు వెళ్లిన బాతులు ఓ చెట్టు వెనక దాక్కుని పాము పన్నాగం మొత్తం కనిపెట్టసాగాయి. గుడ్లు తినేసి పాము పుట్టలోకి వెళ్లడం బాతులు కనిపెడతాయి.
అప్పుడు మగ బాతు చెరువులో నీళ్లు తాగుతున్న గద్దను చూస్తుంది. గద్ద వద్దకు వెల్లి బాతులు తమ గోడు మొత్తం వెళ్లగక్కాయి. మొత్తం విన్న గద్ద .. పాము నాకు ఇష్టమైన ఆహారం. దాన్ని సరైన చోటుకు నేను తీసుకెళ్తానని హామీ ఇచ్చింది. వెంటనే అందరూ కలిసి ఓ ప్లాన్ వేస్తాయి. మర్నాడు ఆడ బాతు మరో రెండు గుడ్లు పెడుతుంది. తర్వాత రెండు బాతులు నిన్నటి మాదిరిగానే చెట్టు వెనకదాక్కుని చూస్తుంటాయి. బాతులు వెళ్లిపోవడం గమనించిన పాము ఆనందంగా బయటకు వచ్చి నేరుగా గుడ్ల వైపుకు వెళ్తుంది. అదే చెట్టుపై ఉన్న బాతు పామును చూడగానే ఒక్కసారిగా నోటిలో కరచుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. అయితే అది ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రాణభయంతో కాపాడండి అంటూ అరవసాగింది. గద్ద ఆ పామును ఓ కొండ మీదకు తీసుకెళ్లింది. పాము తప్పించుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి అది చనిపోయింది. అక్కడ అప్పటికే ఎదురు చూస్తున్న మరో రెండు గద్దలు ఉన్నాయి. అవి పామును చూడగానే ఆబగా తినేశాయి. దెబ్బకు పాము చచ్చిపోయింది. ఇక బాతులు తమ గుడ్లు క్షేమంగా ఉండటంతో ఆనందించాయి. కొన్నాళ్లకు గుడ్లులో నుంచి రెండు అందమైన బాతు పిల్లలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచి బాతులు ఎంతో సంతోషంగా జీవించసాగాయి. పాము లేకపోవడంతో చెట్టుపై ఉన్న పక్షులందరూ కూడా ఎంతో సంతోషించారు. మళ్లీ గూళ్లు కట్టుకుని భయపడకుండా గుడ్లు పెట్టాయి. చిన్న పిల్లలు సురక్షితంగా పెరిగారు. తెలివైన బాతుకు అన్ని పక్షులు కృతజ్ఞతలు తెలిపాయి. నీ తెలివి వల్లే మా కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అని ప్రశంసించాయి.
నీతి
తెలివి, ధైర్యం ఉంటే ఎంత పెద్ద శత్రువునైనా ఎదుర్కోవచ్చు. దురాశ, క్రూరత్వం చివరికి నాశనానికే దారి తీస్తాయి. ఐకమత్యం, సరైన ప్రణాళికతో క్లిష్టమైన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. బలం కంటే బుద్ధి గొప్పది.