నీతి కథ: ఎద్దు న్యాయం.. కష్టపడే వారికే తెలుస్తుంది కష్టంలోని ఆనందం..!

A Moral Story: నీతి కథలు చిన్నవైనా జీవితానికి పెద్ద పాఠాలు నేర్పుతాయి. నిజాయితీ, కష్టం, బాధ్యత వంటి మంచి విలువలను సులభంగా అర్థమయ్యేలా చెప్పే ఈ కథలు పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇక్కడ ఇచ్చిన కథలో, రైతు కోసం కష్టపడే ఎద్దును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన కాకికి ఎద్దు తన తెలివైన మాటలతో జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. ఈ నీతి కథను ఇప్పుడే చదివేద్దాం..

నీతి కథ: ఎద్దు న్యాయం.. కష్టపడే వారికే తెలుస్తుంది కష్టంలోని ఆనందం..!
The Bull's Wisdom A Moral Story
Image Credit source: AI

Updated on: May 23, 2026 | 12:59 PM

నీతి కథలు పిల్లలకే కాదు, పెద్దలకూ జీవిత పాఠాలు నేర్పుతాయి. చిన్న కథ రూపంలో మంచి విలువలు, నైతికత, బాధ్యత, నిజాయితీ వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి. ఇవి పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచుతాయి. నిజాయితీ, కష్టం విలువ, దయ, సహనం వంటి మంచి లక్షణాలను అలవాటు చేస్తాయి. ఇక్కడ ఇచ్చిన నీతి కథలో తనను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన కాకికి కనువిప్పు కలిగిస్తుంది ఎద్దు. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కథ

పెద్దారవీడు అనే చిన్న గ్రామంలో ఓ రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక బలమైన ఎద్దు ఉండేది. ఆ ఎద్దు రోజూ వ్యవసాయ పనుల్లో చాలా కష్టపడేది. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి రైతుతో కలిసి పొలానికి వెళ్లి దుక్కి దున్నడం, బండ్లు లాగడం వంటి పనులు చేసేది. రైతు కూడా దానిని తన కుటుంబంలో ఒకరు అన్నట్లుగా..ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. దానికి సమయానికి గడ్డి, నీళ్లు పెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు.

అదే గ్రామంలో ఒక కాకి ఉండేది. అది ఎప్పుడూ పని చేయకుండా ఇతరుల ఇళ్ల దగ్గర తిరుగుతూ ఏది దొరికితే అది దొంగతనంగా తింటూ గడిపేది. ఒక రోజు సాయంత్రం ఎద్దు పొలం పని ముగించుకుని అలసటగా ఇంటికి వస్తుండగా కాకి దాని దగ్గరకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

“అయ్యో ఎద్దూ! నువ్వు ఎంత అమాయకుడివో! ఉదయం నుంచి రాత్రివరకు కష్టపడుతున్నావు. రైతు నీ చేత పనులు చేయించుకుని కొద్దిగా గడ్డి పెడితే చాలు అనుకుంటున్నాడు. నన్ను చూడు! నేను ఉదయం నుంచి రాత్రి వరకు ఏ పనీ చేయను. ఎక్కడ ఏది దొరికితే అది తీసుకుని తింటాను. హాయిగా జీవిస్తున్నాను,” అని కాకి గర్వంగా చెప్పింది.

కష్టపడి సంపాదించిన దానిలోనే సంతోషం..

కాకి మాటలు విన్న ఎద్దు చిరునవ్వు నవ్వింది. “నేను కష్టపడుతున్నానని ఎప్పుడూ బాధపడను. నా వల్ల రైతు కుటుంబం సంతోషంగా జీవిస్తోంది. పొలాల్లో పంటలు పండితే ఎంతోమంది ప్రజల ఆకలి తీరుతుంది. నా కష్టానికి విలువ ఉంది. కానీ నువ్వు దొంగతనంగా తినే ఆహారంలో ఆనందం ఉండదు. కష్టపడి సంపాదించిన దానిలోనే నిజమైన సంతోషం ఉంటుంది,” అని సమాధానం చెప్పింది.

ఎద్దు మాటలు విన్న కాకికి తన తప్పు అర్థమైంది. అప్పటి నుంచి అది కూడా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా జీవించాలని నిర్ణయించుకుంది.

నీతి

కష్టపడి పనిచేసేవారికే నిజమైన ఆనందం, గౌరవం లభిస్తాయి. కష్టపడే వారికే కష్టంలోని సంతోషం తెలుస్తుంది. కష్టం విలువ, నిజాయితీని ఈ నీతి కథ మనకు అర్థమయ్యేలా చేస్తుంది.

నీతి కథలు మనిషిలో మంచి ఆలోచనలు పెంచి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చిన్న కథలో పెద్ద సందేశం దాగి ఉండటమే వాటి ప్రత్యేకత. చిన్న కథల ద్వారా పెద్ద జీవిత సత్యాలు తెలుస్తాయి.

Follow Us