ఇటీవల గుండె పోటు బారినపడుతోన్న వారి సఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వాళ్లు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మంచి జీవన విధానం, ఆహారం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చచేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ గుండె సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి యాంటీ ఏజింగ్ ఎలిమెంట్‌లాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం గుండెకు టానిక్ లా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీని వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉండి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉండదు. ఇక వెల్లుల్లి ఎలా తీసుకోవాలంటే.. భోజనానికి ముందు రోజుకు ఒకసారి సగం పచ్చి వెల్లుల్లిని తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
* దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాల కారనంగా ట్రైగ్లిజరైడ్స్, LDL స్థాయి గణనీయంగా తగ్గుతుంది, అయితే HDL స్థాయి గణనీయంగా పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగువుతుంది. దానిమ్మను ప్రతీరోజూ ఉదయం టిఫిన్‌గా తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
* అర్జున చెట్టు బెరడులోని ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సిరలు, ధమనుల్లో రక్తం ప్రవాహం సాపీగా జరిగేలా చూస్తుంది. గుండె లయబద్ధంగా కొట్టుకునేలా చేస్తుంది. రక్తపోటుని నియంత్రింస్తుంది. పోగాకు, దూమపానం వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ‘ఈ’ సమృద్ధిగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షస్తుంది కూడా. దీనిని ఎలా తీసుకోవాలంటే.. 100 ml నీరు, 100 ml పాలు తీసుకుని, అందులో 5 గ్రాముల అర్జున బెరడు పొడిని వేసి, అది సగానికి తగ్గే వరకు మరిగించాలి. దీన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..