
మీరు అరటి తొక్కలను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. వాటిలో మీ ముఖానికి మేలు చేసేవి అనేక గుణాలు ఉన్నాయి. అరటి తొక్కలు ముఖానికి ఒక వరంలాంటిది అంటున్నారు నిపుణులు. ఇది చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. వారానికి రెండుసార్లు అరటి తొక్కలను మీ ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయని చెబుతున్నారు. అరటి తొక్కలను ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మంలోని మురికిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. ముఖ పిగ్మెంటేషన్ తగ్గించడానికి మీరు అరటి తొక్కలను అప్లై చేయవచ్చు. మీ ముఖం మీద ముడతలు ఉన్నా, అరటిపండు తొక్కలను అప్లై చేయాలి. దీంతో మొటిమలు, మొటిమల మచ్చలను తొలగించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
అరటిపండు రుచికరమైనదే కాకుండా, తొక్క కూడా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం చెబుతున్నాయి. అరటి తొక్కలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలపరచి, రక్తపోటును నియంత్రించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహాయకారి, ఎందుకంటే కడుపు ఎక్కువసేపు నిండిన భావన కలిగిస్తుంది. జీవక్రియ వేగవంతం అవడంతో కొవ్వు కరిగే ప్రక్రియ త్వరగా జరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్ గుణాల వలన చర్మ సమస్యలు తగ్గి, మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. జుట్టుకు పేస్ట్ చేసి పూస్తే చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. తొక్కను నేరుగా తినకూడదు, బాగా కడిగి ఉడకబెట్టి లేదా ఆవిరి చేసి వాడాలి. వంటలో చట్నీ, స్మూతీ, కూరగాయల్లో వాడవచ్చు. చిన్న మోతాదుతో మొదలు పెట్టడం మంచిది.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.