
ఆదివారం వారంలోని అత్యంత ప్రత్యేకమైన రోజులలో ఒకటి. ఈ రోజున అందరూ ఇంట్లోనే ఉంటారు. ఫ్యామిలీ మొత్తం కలిసి హాపీగా గడుపుతారు.. ఇదంతా మార్నింగ్ బ్రేక్‌పాస్ట్‌తో స్టార్ట్ అవుతుంది. ఆరోజు మీరు ప్రత్యేక బ్రేక్‌ఫాస్ట్ తినాలి అనుకుంటే పాలక్ పరోటా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనికి కావలసి ఇంగ్రీడియన్స్ అన్నీ మన కిచెన్‌లోనే దొరుకుతాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. అలాగే ఇది రుచితో పాటు ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా, బంగాళాదుంప, పాలకూర పరోటాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందా పదండి.
ఆలూ పాలక్ పరోఠా తయారీకి కావలసిన పదార్థాలు
స్టెప్ 1:ముందుగా, ఒక గిన్నెలో కొద్దిగా పిండిని తీసుకొండి. దానిలో కొంచెం ఉప్పు, నెయ్యి, కొద్దికొద్దిగా నీళ్లు పోసి పిండిని బాగా కలపండి. తర్వాత, దానిని మూతపెట్టి 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచండి.
స్టెప్ 2:తర్వాత మరొక గిన్నెలో, ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా తురుముకోవాలి. తరువాత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఎర్ర కారం, కొత్తిమీర పొడి, మామిడికాయ పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత, సన్నగా తరిగిన పాలకూర వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే మీరు సెలెరీని కూడా యాడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 3: తరువాత, పిండిని చిన్న ఉండలుగా చుట్టండి. వాటిని సిద్ధం చేసిన బంగాళాదుంప-పాలకూర ఫిల్లింగ్‌తో నింపి, చిరిగిపోకుండా రౌండ్‌గ్‌గా రుద్దుకోండి. తర్వాత పాన్ వేడి చేసి దానిపై మీరు రెడీ చేసుకున్న పరోటాను వేయించండి.. ఇలా చేసే క్రమంలో పరోటాకు రెండు వైపులా నెయ్యి లేదా నూనె రాయండి. పరోటా రెండు వైపుల గోదుమ వర్ణంలోకి వచ్చాక పెనంపై నుంచి తీసి ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. తర్వాత మీరు ముందుగా రెడీ చేసుకున్న రైతాతో కలిపి ఆస్వాదించండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.