Sunset: సూర్యుడు 24 గంటలూ ఉంటే ఎలా ఉంటది.. వామ్మో అనుకుంటున్నారా.. అక్కడ మాత్రం ఇది కామన్..

|

May 03, 2022 | 8:48 PM

Sunset: మనం ఈ ఎండాకాలంలో సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాం. మండే ఎండలతో స్వాంతన కోసం సాయంత్రం ఎప్పుడు అవుతుందా.. చల్లగాలిలో డాబాలపై పడుకుందామా అని ఆలోచిస్తుంటాం. కానీ ఆ దేశాల్లో అలా కుదరదు..

Sunset: సూర్యుడు 24 గంటలూ ఉంటే ఎలా ఉంటది.. వామ్మో అనుకుంటున్నారా.. అక్కడ మాత్రం ఇది కామన్..
Sunset
Follow us on

Sunset: మనం ఈ ఎండాకాలంలో సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాం. మండే ఎండలతో స్వాంతన కోసం సాయంత్రం ఎప్పుడు అవుతుందా.. చల్లగాలిలో డాబాలపై పడుకుందామా అని ఆలోచిస్తుంటాం. పగలంతా ఎలాగొలా సర్దుకుపోతాం. కానీ ఆదేశాల్లో అలా కుదరదు. ఎందుకంటే అక్కడ మనలాగా సూర్యుడు అస్తమించడు. అసలు ఈ భూమ్మీద సూర్యుడు అస్త‌మించ‌ని ప్రాంతాలు కొన్ని ఉన్నాయ‌న్న సంగ‌తి మీకు తెలుసా. అర్ధ‌రాత్రి అయినా కూడా అక్క‌డ ప‌ట్ట‌ప‌గల్లాగానే ఉంటుంది. ఇవి ఇండియాలో కాదులేండి. మరెక్కడ అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా.. అయితే ఈ దేశాల గురించి తెలుసుకోవాల్సిందే. నిరంతరం సూర్యుడు అందుబాటులో ఉండే ప్రాంతాలేవో ఇప్పుడు చూద్దాం..

నార్వే: ఏడాదిలో చాలా కాలం పాటు నార్వేలో సూర్యుడు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా ప‌ట్ట‌ప‌గ‌లు లాగా ఎండ ఉంటుంది. అందుకే నార్వే దేశాన్ని అర్ధ‌రాత్రి సూర్యుడు ఉద‌యించే ప్రాంతం Land Of Midnight Sun అని కూడా పిలుస్తారు. అక్షాంశానికి ఎక్కువ ఎత్తులో ఉండ‌టం వ‌ల్లే అక్క‌డ కొద్దిరోజుల పాటు సూర్యుడు అస్త‌మించ‌డు. మే నుంచి జూలై మ‌ధ్య‌లో దాదాపు 70 రోజుల పాటు సూర్యుడు నిరంత‌రం ప్ర‌కాశిస్తూనే ఉంటాడు. ఒక రోజులో కేవ‌లం నాలుగు గంట‌లు మాత్రం మ‌బ్బుల చాటుకు వెళతాడట. నార్వేలోని స్వాల్ బార్డ్‌లో ఏప్రిల్ 10 నుంచి ఆగ‌స్టు 23 వ‌ర‌కు సూర్యుడు నిరంత‌రం ప్ర‌కాశిస్తూనే ఉంటాడు.

ఫిన్లాండ్‌: అంద‌మైన స‌ర‌స్సులు, ద్వీపాల‌కు పెట్టింది పేరైన ఫిన్లాండ్‌ లోనూ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో ఎండాకాలంలో 70 రోజుల పాటు సూర్యుడు అస‌లు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా ప‌ట్ట‌ప‌గ‌ల్లాగే ఉండటం అక్కడ విశేషం. అయితే చలికాలంలో మాత్రం అక్కడ అస‌లు సూర్యుడి జాడే క‌నిపించ‌డు.

ఐస్‌లాండ్‌: యూర‌ప్‌లో ఉన్న అతిపెద్ద ద్వీపం ఐస్‌లాండ్‌. అక్క‌డ నివాస ప్రాంతాలు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ర్యాట‌కంగా దీనికి మంచి ఆద‌ర‌ణ ఉంది. అక్క‌డ జూన్ నెల‌లో సూర్యుడు అస్త‌మించడు. ఆ నెల రోజులు ప‌గ‌లు, రాత్రికి అస్సలు తేడా ఉండ‌దు. అందుకే జూన్ నెల‌లో ఇక్కడికి ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ఐస్‌లాండ్‌లో దోమ‌లు కూడా ఉండ‌వు.

కెన‌డా: కెనడాలోని యుకోన్‌లో ఏడాది పొడ‌వునా మంచు కురుస్తూనే ఉంటుంది. అయితే 50 రోజులు మాత్రం వేస‌వి కాలం ఉంటుంది. ఈ కాలంలో అర్ధ‌రాత్రి కూడా సూర్యుడు ఉద‌యిస్తూనే ఉంటాడు. అందుకే ఆ 50 రోజుల్లో అనేక పండుగ‌లు, ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు అక్కడి వారు. ఇందులో భాగంగానే ప్ర‌తి ఏటా జూలై మ‌ధ్య‌లో గ్రేట్ నార్త‌ర్న్ ఫెస్టివ‌ల్ కూడా జ‌రుపుకుంటారు. గోల్ఫ్ ఈవెంట్లు కూడా నిర్వ‌హిస్తారు. చ‌లికాలంలో మాత్రం నునావ‌ట్‌లో 30 రోజుల పాటు సూర్యుడు క‌నిపించ‌డు.

స్వీడ‌న్‌: స్వీడ‌న్‌లోని కిరున్ న‌గ‌రంలో ఏడాదిలో దాదాపు వంద రోజుల పాటు సూర్యుడు అస్త‌మించ‌డు. మే నుంచి ఆగ‌స్టు మ‌ధ్య‌లో సూర్యుడు ఎప్పుడూ ప్ర‌కాశిస్తూనే ఉంటాడు. అందుకే ఈ స‌మ‌యంలో ఈ న‌గ‌రాన్ని చూసేందుకు ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తుంటారు. దీంతోపాటు కిరున్ ఆర్ట్ నోయువే చ‌ర్చి కూడా చాలా పాపుల‌ర్‌. ఈ చ‌ర్చి ఆర్కిటెక్చ‌ర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే కిరున్‌లోని ఈ చ‌ర్చిని చూసేందుకు అనేక మంది టూరిస్టులు అక్కడికి వస్తుంటారు.

అలాస్కా: అమెరికాకు చెందిన‌ అలాస్కాలోని బారోలో మే నుంచి జూలై వ‌ర‌కు సూర్యుడు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా సూర్యుడు వెలుగులు విర‌జిమ్ముతూనే ఉంటాడు. కానీ న‌వంబ‌ర్ నెల‌లో 30 రోజులు మాత్రం చీక‌టిగా ఉంటుంది. దీన్నే పోలార్ నైట్ అని పిలుస్తారు.

కానాక్‌, గ్రీన్‌లాండ్‌: గ్రీన్‌లాండ్‌లో ఉత్త‌రంవైపు ఉండే కానాక్ న‌గ‌రం.. చలికాలంలో పూర్తిగా చీక‌ట్లోనే ఉంటుంది. అదే వేస‌వికాలంలో ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య మాత్రం సూర్యుడు రోజంతా ప్ర‌కాశిస్తూనే ఉంటాడు. ఇలా ప్రపంచంలోని అనేక దేశాల్లో సూర్యుడు నిరంతరాయంగా ఉదయించే ఉంటాడు.

ఇవీ చదవండి..

IDFC FIRST Bank: ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల వడ్డీ రేట్లలో మార్పు..!

Power Shortage: కంరెట్ కోతలకు అణు విద్యుత్ ప్రత్యామ్నాయమా.. తయారీలో మనం ఎందుకు వెనకబడ్డాం..