
బిర్యానీ బాస్మతితోనే కాకుండా సోనా మైసూరి రైస్‌తో కూడి ప్రిపేర్ చేసుకోవచ్చును. దీని కోసం కావాల్సిన పదార్థాలు : సోనా మైసూరి రైస్ అర కేజీ, ఉల్లిపాయ ముక్కలు తరిగినవి, బిర్యానీ ఆకుల, అనాస పువ్వు, షాజీరా, కారం, ఉప్పు, కొత్తిమీర, పూదీనా, నూనె, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు, నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చికెన్.

తయారీ విధానంలోకి వెళితే..సోనా మైసూరి బియ్యం ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టి పెట్టుకోవడం వలన వీటి గింజలు చాలా పొడవుగా వస్తాయి. అయితే చాలా వరకు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ బియ్యం ఉంటాయి కాబట్టి, వీటితో అందరూ సులభంగా తయారు చేసుకోవచ్చును. ముందుగా తరిగిన ఆనియన్ ముక్కలను వేయించి, బంగారు రంగులో వచ్చాక పక్కన పెట్టుకోవాలి.

ముందుగా చికెన్ తీసుకొని పూర్తిగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కారం , ఉప్పు, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసరం, గరం మసాలా, ధనియాల పొడి , వేయించి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసి దాదాపు పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు రైస్ వండుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన బియ్యంతో.. దీని కోసం స్టవ్ ఆన్ చేసి అందులో పచ్చి మిర్చి, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత దానికి బియ్యానికి సరిపడ నీళ్లు పోసి నీళ్లు బాగా మరగనివ్వాలి. తర్వాత అందులో రైస్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికే క్రమంలో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. నూనె పోసి, బిర్యానీ ఆకు, లవంగాలు, అనాస పువ్వు, ఆనియన్స్, పసుపు, అన్నీ వేసి వేయించుకున్నాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి.

చికెన్ బాగా ఉడికి, చిక్కటి గ్రేవీ రావాలి. ఈ సమయంలో మనం పక్కన ఉన్న రైస్ 70 శాతం ఉడికిందో చూసుకోవాలి. అలా ఉడికినట్లు అయితే, ఈ చికెన్ గ్రేవీలో రైస్ వేయాలి. తర్వాత దాని పై నుంచి కొత్తిమీర, వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మరో పావు గంట ఉడికించుకోవాలి. అంతే బాస్మతి రైస్ లేకుండా, సోనా మైసూరి రైస్‌తో బిర్యానీ రెడీ.