
ఈ ఏడాది జరిగే అతిపెద్ద ఖగోళ వింతల్లో ఒకటి.. ఆగస్టు 12 ఏర్పడే పరిపూర్ణ సూర్య గ్రహణం. జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మికంగానూ సూర్య గ్రహణానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ గ్రహణం గురించి భారతీయలు, హిందూ సాంప్రదాయాలను పాటించేవారు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు ఈ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది..? మన దేశంలో కనిపిస్తుందా.. లేదా..? సూతక కాలం నియమాలు వర్తిస్తాయా..? అనే విషయాల గురించి చాలా మందికి రకరకాల డౌట్లు ఉన్నాయి. ఈ పరిపూర్ణ సూర్య గ్రహణం గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు, పోర్చుగల్‌లోని చిన్న భాగంలో స్పష్టంగా కనిపించనుంది. ఇక పాక్షిక గ్రహణం విషయానికి వస్తే.. ఐరోపాలోని ఎక్కువ భాగాలు, కెనడా, ఉత్తర అమెరికా, వాయువ్య ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంది.
కనిపించదు. ఈ సూర్య గ్రహణం మన దేశంలో కనిపించదు. మన దేశం పరిపూర్ణ గ్రహణ మార్గంలో కానీ, పాక్షిక గ్రహణ ప్రాంత సరిహద్దుల్లో కానీ లేదు. భారతీయ పంచాంగ గణనాల ప్రకారం కూడా ఈ గ్రహణం మన దేశంలో ఎక్కడా కనిపించదు.
ఈ గ్రహణం మన దేశంలో కనిపించనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ ఖగోళ ఘట్టం భారత కాలమానం ప్రకారం ఇలా ఉన్నాయి.
చాలామంది భారతీయుల్లో ఉండే ప్రధాన సందేహం.. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు, పూజలు చేయకూడదు అనే సూతక కాలం వర్తిస్తుందా లేదా? అని. హిందూ సాంప్రదాయాల ప్రకారం.. ఏ ప్రాంతంలోనైతే గ్రహణం కంటికి కనిపిస్తుందో, ఆ ప్రాంతంలో మాత్రమే నియమాలు వర్తిస్తాయి. సాధారణంగా సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. ఢిల్లీతో సహా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనూ ఈ గ్రహణం కనిపించట్లేదు కాబట్టి సూతక కాలం ఉండదు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు పాటించే ప్రత్యేక నియమాలు కూడా ఈసారి పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి భారతీయ కుటుంబాలు ఎలాంటి పూజ, ఆహార నియమాలు పాటించాల్సిన పనిలేదు.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను ఛాయా గ్రహాలైన రాహు, కేతువులతో ముడిపెట్టి చూస్తారు. ఇవి మూఢనమ్మకాలు కాకుండా ఒక ఆధ్యాత్మిక దృక్పథంతో చూస్తే ఒక మంచి అంతర్మథనానికి
ఉపయోగపడతాయని నిపుణులు చెబుతారు. మనలోని అహంకారం, పాత ఆలోచనలు, చెడు అలవాట్లను వదిలేయడానికి గ్రహణ సమయం మంచి అవకాశంగా భావిస్తారు. సూతక కాలం లేకపోయినప్పటికీ, మానసిక ప్రశాంతత కోసం, వ్యక్తిగత వికాసం కోసం భగవన్నామ స్మరణ లేదా మంత్ర జపం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని విశ్వసిస్తారు.