
ఎండుద్రాక్షను నీటిలోనే కాకుండా, రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలు, ఎండుద్రాక్షల కలయిక వల్ల శరీరానికి కాల్షియం, ప్రోటీన్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా అందుతాయి. ఇది ఎముకలను బలోపేతం చేసి మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. అలాగే, రక్తహీనత, మలబద్ధకం, అధిక రక్తపోటు వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
పాలు, ఎండుద్రాక్ష రెండింటిలోనూ కాల్షియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు బలహీనంగా ఉన్నవారు లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఒక నెల పాటు పాలలో నానబెట్టిన ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది మహిళల్లో వచ్చే బోలు ఎముకల వ్యాధి (Osteoporosis) ప్రమాదాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది.
ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రాత్రంతా పాలలో నానబెట్టడం వల్ల ఇందులోని పోషకాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. కేవలం నెల రోజుల పాటు దీనిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత (Anemia) తగ్గుతుంది. అలాగే, ఇందులోని పొటాషియం రక్తపోటును (Blood Pressure) అదుపులో ఉంచుతుంది.
ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పాలలో నానబెట్టడం వల్ల ఇవి మరింత మృదువుగా మారి, పేగులకు అంటుకోకుండా మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా (Gut Bacteria) మెరుగై, జీర్ణక్రియ రేటు పెరుగుతుంది.
ఎండుద్రాక్షలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే, ఇందులోని ముఖ్యమైన నూనెలు చర్మం పొడిబారడం, మొటిమలు, హైపర్ పిగ్మెంటెషన్ వంటి చర్మ సమస్యలను నయం చేసి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అధిక ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఈ మిశ్రమం ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. కేవలం ఒక నెల పాటు ఈ నియమాన్ని పాటిస్తే మీ ఆరోగ్యంలో ఊహించని మార్పులను గమనించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..