Viral Video: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? ఈ వీడియోలో కన్పించిన విధంగా చేస్తే చిటికెలో నిద్ర పోతారు..

|

Sep 13, 2022 | 6:06 PM

నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. నిద్రలేమితో కారణంగా మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే..

Viral Video: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? ఈ వీడియోలో కన్పించిన విధంగా చేస్తే చిటికెలో నిద్ర పోతారు..
Sleeping
Follow us on

Simple Ways to Fall Asleep Fast: మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం. ఐతే వేగంగా దూసుకెళుతున్న నేటి తరం ఉరుకులు పరుగుల జీవనశైలికి అలవాటు పడి నిద్రపై శ్రద్ధ పెట్టడం లేదు. రాత్రిళ్లు తక్కువగా నిద్ర పోవడం వల్ల ఉద్యోగం, పనులు, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక ఈ తరం యువత రాత్రుళ్లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసుకుంటూ నిద్ర పాడుచేసుకుంటున్నారు. ఇలా నిద్రలేమితో జీవితాన్ని కొనసాగిస్తే కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని నిద్రలేమి అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని అతినిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి హానికరమే. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్రపోతారు. చిన్న పిల్లలు 11 గంటలు, టీనేజీ వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. 20 ఆపైన వయసు వారు రోజుకు 6 – 8 గంటలు నిద్రపోతే సరిపోతుంది.

నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. నిద్రలేమితో కారణంగా మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదముందని పరిశోదకులు అంటున్నారు. ఇక్కడ మీకోసం కొన్ని యోగాసనాలు సూచిస్తున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోతే ఈ వీడియోలో కన్పిస్తున్న యోగాసనాలను వేస్తే ఆ తర్వాత మీకు కమ్మని నిద్ర పడుతుంది. అవేంటంటే.. వజ్రాసన, సుప్త మస్తేంద్రాసన, బాలాసన, బద్ద కోనాసన, విపరీత కరణి ఆసనం. ఈ ఆసనాలు బెడ్‌ మీద కూడా వేయవచ్చు. మీరు కూడా నిద్రలేమితో బాధపడుతుంటే వెంటనే ఈ ఆసనాలు ట్రై చేయండి.