డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో తెలిస్తే.. ఇప్పుడే స్టార్ట్ చేస్తారు!

డాక్టర్లు ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు పూటలా బ్రష్ చేయాలని సలహా ఇస్తారు. కానీ చాలామంది కేవలం మార్నింగ్ మాత్రమే చేసి నైట్‌ టైం లైట్ తీసుకుంటారు. కానీ ఈ నిర్లక్ష్యం నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలో చూద్దాం.

డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో తెలిస్తే.. ఇప్పుడే స్టార్ట్ చేస్తారు!
Night Brushing Benefits

Updated on: Jun 21, 2026 | 11:54 AM

చాలా మంది మార్నింగ్ మాత్రమే బ్రష్ చేసి తన నోరు ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. కాదని నిర్లక్ష్యం చేస్తే ఇది నేరుగా మీ గుండెపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. నోరు శుభ్రంగా ఉంటే, గుండె కూడా సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు.

నైట్ బ్రష్ చేయడం ఎందుకు ముఖ్యం?

ప్లాక్, టార్టార్ ఏర్పడటం: యుఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం.. ఉదయం నుంచి మనం తినే ఆహార పదార్థాల సూక్ష్మ కణాలు పళ్ళు, చిగుళ్ళ మధ్య ఇరుక్కుపోతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయకపోతే, నోట్లోని బ్యాక్టీరియా వీటిపై వేగంగా పెరిగి ‘ప్లాక్’ ఏర్పడుతుంది. ఇది కాలక్రమేణా గట్టిపడి ‘టార్టార్’ గా మారుతుంది. దీనివల్ల చిగుళ్ళ వాపు, రక్తం కారడం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చిగుళ్ళలో వాపు వచ్చినప్పుడు, ఆ బ్యాక్టీరియా రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుని అక్కడ కూడా ఇన్ఫెక్షన్లను ఏర్పడే అవకాశం ఉంది..

గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది.

చిగుళ్ళ వ్యాధుల ప్రభావం గుండెపై చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీర్ఘకాలికంగా ఉండే చిగుళ్ళ వాపు వల్ల రక్తనాళాల లోపలి పొర దెబ్బతింటుందని.. దీనివల్ల ధమనులలో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఈ పరిస్థితే కాలక్రమేణా హార్ట్ ఎటాక్ లేదా ఇతర గుండె జబ్బులకు దారితీస్తుందని చెబుతున్నాయి. ఒక వేళ మీరు ఈ విషాన్ని లైట్ తీసుకుంటే మీరు హార్ట్‌ పేషెంట్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతి డాక్టర్ డైలీ రెండు సార్లు బ్రష్ చేయాలని సజెష్ చేస్తారు.

నిపుణులు చెప్తుందేంటి?

కేవలం మార్నింగ్ మాత్రమే బ్రష్ చేసే వారితో క్రమం తప్పకుండా రాత్రి పూట కూడా బ్రష్ చేసేవారిరి పోల్చి చూస్తే.. రాత్రి పళ్లు తోముకునే వారు, సమయానుకూలంగా డెంటిస్ట్‌ను కలిసి పళ్ళను శుభ్రం చేయించుకునే వారిలో చిగుళ్ళ వ్యాధుల ముప్పు చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటే, శరీరంలో ఇన్ఫెక్షన్ల స్థాయి అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఇది పరోక్షంగా గుండెను కాపాడుతుందని సూచిస్తున్నారు. కాబట్టి, రాత్రి పూట బ్రష్ చేయడం అనేది కేవలం పళ్ళకు సంబంధించిన చిన్న అలవాటు మాత్రమే కాదు, అది మీ గుండెను, పూర్తి శరీరాన్ని రక్షించే ఒక సులువైన మార్గం అని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us