Health Tips: వామ్మో.. నిమ్మకాయను డైరెక్ట్‌గా ముఖానికి పెడితే అలా అవుతుందా..? తెలిస్తే షాకే..

నిమ్మకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మ శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయను అందానికి కూడా ఉపయోగించొచ్చు. అయితే నిమ్మకాయను నేరుగా ముఖానికి అప్లై చేయవద్దు. అప్లై చేస్తే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: వామ్మో.. నిమ్మకాయను డైరెక్ట్‌గా ముఖానికి పెడితే అలా అవుతుందా..? తెలిస్తే షాకే..
How To Use Lemon For Face

Updated on: Aug 23, 2025 | 10:09 PM

అందంగా, కాంతివంతంగా కనిపించాలని కోరుకోని వారు ఎవరూ ఉండరు. అందుకోసం రకరకాల క్రీములు, చిట్కాలు పాటిస్తుంటారు. వీటిలో నిమ్మకాయను వాడటం చాలా సాధారణం. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా భావిస్తారు. కానీ చర్మానికి ఏదైనా పూసే ముందు, దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది. వాటిలో నిమ్మకాయ ఒకటి. నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాసుకోవడం చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల చర్మానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిమ్మకాయ వల్ల చర్మానికి కలిగే నష్టాలు

నిమ్మకాయలో ఉండే అధిక ఆమ్ల గుణం వల్ల చర్మంపై నేరుగా వాడినప్పుడు ఈ సమస్యలు తలెత్తుతాయి:

దురద, మంట: సున్నితమైన చర్మం ఉన్నవారికి నిమ్మరసం నేరుగా అప్లై చేయడం వల్ల చర్మంపై వాపు, దురద, మంట, ఎరుపు వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే చర్మంపై బొబ్బలు కూడా రావచ్చు.

వడదెబ్బ ప్రమాదం: నిమ్మరసం చర్మాన్ని చాలా సున్నితంగా మారుస్తుంది. ఆ సమయంలో సూర్యరశ్మి తగిలితే సులభంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది హైపర్‌పిగ్మెంటేషన్‌కు దారితీస్తుంది.

ముడతలు: నిమ్మకాయలో ఉండే అధిక ఆమ్లత్వం చర్మం యొక్క pH బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. దీని వల్ల చర్మంపై ముడతలు త్వరగా వస్తాయి. అలాగే మొటిమల సమస్యలు పెరిగి, నల్లటి మచ్చలకు కారణమవుతాయి.

నిమ్మకాయను ఎలా వాడాలి?

నిమ్మకాయ ప్రయోజనాలు పొందాలంటే దాన్ని నేరుగా వాడకుండా ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. నిమ్మరసాన్ని శనగపిండి, ముల్తానీ మట్టి, గ్లిజరిన్, కొబ్బరి నూనె లేదా కలబంద జెల్ వంటి వాటితో కలిపి వాడటం సురక్షితం. ఇలా చేస్తే నిమ్మకాయలోని ఆమ్ల గుణం యొక్క తీవ్రత తగ్గి చర్మానికి ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. కాబట్టి, ముఖానికి నిమ్మకాయను అప్లై చేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..