
సాధారణంగా ముఖం మీద చర్మం జిడ్డుగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయి. చెమట, ధూళి ముఖానికి అంటుకున్నప్పుడు, అవి చర్మంలోని చిన్న రంధ్రాలలో చిక్కుకుని మొటిమలు సమస్యకు కారణం అవుతాయి. ఇందుకోసం చాలా మంది మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ బొప్పాయి పండు విత్తనాల ద్వారా ఈ మొటిమల సమస్యలను సులువుగా వదిలించుకోవడానికి సహాయపడతాయి. బొప్పాయి గింజలను ఈ కింది విధంగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలన్నీ సులువుగా పరిష్కరించవచ్చు.
బొప్పాయి గింజలు మొటిమల సమస్యలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. బొప్పాయి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి మొటిమల ఉన్న చోట రాయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా, విత్తనాలలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తాయి. మొటిమల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే బొప్పాయి గింజలను పేస్ట్ లా చేసి దానికి తేనె కలపాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ఇందులోని తేనె చర్మానికి తేమ ఇస్తుంది. బొప్పాయి గింజలు చర్మాన్ని బిగుతుగా చేయడానికి సహాయపడతాయి. ఇరవై నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
బొప్పాయి గింజలను రుబ్బి, దానికి కొద్దిగా నీరు లేదా తేనె కలిపి స్క్రబ్ లా చేసుకోవాలి. దీనితో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇది మొటిమలను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.
ముందుగా బొప్పాయి గింజలను పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీనికి కొంచెం పాలు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్ చర్మానికి లోతైన పోషణను అందించి మృదువుగా చేస్తుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ముఖ కాంతిని పెంచుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.