
క్యారెట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి, వీటిని తినమని వైద్యులు కూడా చెబుతారు. ఎందుకంటే, క్యారెట్లలో బీటా-కెరోటిన్, ఫైబర్, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి.

మలబద్ధకం: ఈ రోజుల్లో ఎంతో మంది జీర్ణ సంబంధిత సమస్యలతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారు వీటిని టచ్ చేయోద్దని వైద్యులు చెబుతున్నారు. ఇవి ఒక్కోసారి మంచి కన్నా హానికరమవుతాయని అంటున్నారు.

డయాబెటిస్: డయాబెటిస్ సమస్య రోజు రోజుకి ఎక్కువవుతుంది. కాబట్టి, తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్యారెట్లలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, వీటికి దూరంగా ఉంటేనే మంచిది.

నిద్రలేమి సమస్య: సమయానికి నిద్ర పట్టక నైట్ అంతా మేల్కొంటూ కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఒత్తిడి కూడా ఒక కారణం. ఆ సమయంలో క్యారెట్ అస్సలు తీసుకోకండి. ఇది నిద్ర రాకుండా చేస్తుంది.

అలెర్జీలు: చర్మ అలెర్జీలు ఉన్నవారు క్యారెట్ అస్సలు తినకండి. ఇది దురద వచ్చేలా చేస్తుంది. అలాంటి వాళ్లు తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)