నిద్రపోయేటప్పుడు బెడ్‌రూమ్ తలుపులు మూసి ఉంచుతున్నారా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!

Updated on: Apr 16, 2026 | 10:41 AM

మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే రాత్రిపూట గాఢ నిద్ర అవసరం. అయితే నిద్రపోయేటప్పుడు గది వాతావరణం ఎలా ఉండాలనే దానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా తలుపులు తెరిచి ఉంచాలా లేదా మూసి ఉంచాలా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తప్పక తెలుసుకోవాలి. నిద్రపోయే సమయంలో బెడ్‌రూమ్ తలుపులు తెరిచి ఉంచాలా లేదా మూసి ఉంచాలా అనే అంశంపై నిపుణులు ఆసక్తికరమైన సలహాలు ఇచ్చారు.

1 / 5
నిద్రకు అనుకూలమైన వాతావరణం లేకపోతే చాలా మందికి నిద్ర పట్టడం కష్టమవుతుంది. కొందరు తలుపులు, కిటికీలు తెరిచి నిద్రపోవడానికి ఇష్టపడితే, మరికొందరు గదిని మూసి ఉంచడానికి ఇష్టపడతారు. కొందరు మసక వెలుతురులో నిద్రపోతే, మరికొందరు పూర్తి చీకటిలో నిద్రపోతారు. అయితే, నిపుణుల ప్రకారం నిద్ర పోయేందుకు సరైన వాతావరణం ఎలా ఉండాలో మీకు తెలుసా? ఎలాంటి గది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది ? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
నిద్రపోతున్నప్పుడు తలుపు తెరిచి ఉంచడం మంచిదా లేక మూసి ఉంచడం మంచిదా? చాలా మంది దీనిని ఒక అలవాటుగా భావిస్తారు. కానీ, ఇది మీ నిద్ర, శ్వాస, ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మీరు నిద్రపోతున్న గది తలుపులు మూసి ఉంచడం వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి.

3 / 5
చీకటిగా ఉండే గదిలో మెలటోనిన్ అనే హార్మోన్ బాగా విడుదలవుతుంది. ఇది మనల్ని త్వరగా నిద్రపోయేలా చేస్తుంది. తలుపులు తెరిచి ఉంచితే హాల్ లేదా ఇతర గదుల నుంచి వచ్చే వెలుతురు నిద్రకు భంగం కలిగిస్తుంది. బయట ఇతరులు మాట్లాడే శబ్దాలు లేదా టీవీ శబ్దాలు బెడ్‌రూమ్‌లోకి రాకుండా ఉండాలంటే తలుపులు మూసి ఉంచడం ఉత్తమం.

4 / 5
ఏసీ లేదా ఫ్యాన్ గాలి గదిలోనే ఉండి, ఉష్ణోగ్రత 20 నుండి 22 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. నిద్రకు ఈ ఉష్ణోగ్రత అనుకూలమైనది. అంతేకాదు.. ఏదైనా అత్యవసర పరిస్థితి (ఉదాహరణకు మంటలు చెలరేగడం) తలెత్తినప్పుడు, మూసి ఉన్న తలుపులు పొగ, వేడి గదిలోకి రాకుండా కొంత సమయం పాటు అడ్డుకోగలవు.

5 / 5
పిల్లలను పడుకోబెట్టినప్పుడు కూడా తలుపు మూసి ఉంచాలి. దీనివల్ల వారు ఇంట్లోని సాధారణ శబ్దాలకు అలవాటు పడతారు. డిస్టర్బ్ అవ్వకుండా నిద్రిస్తారు. అలాగే, పెంపుడు జంతువులను బెడ్‌రూమ్ బయటే పడుకోబెట్టి తలుపు వేయడం వల్ల, అవి అర్ధరాత్రి గదిలోకి వచ్చి మీ నిద్రను పాడు చేయకుండా ఉంటాయి. చివరిగా.. ఒకవేళ మీ గదిలో కిటికీలు లేకపోయినా లేదా వెంటిలేషన్ తక్కువగా ఉన్నా, తలుపును కొద్దిగా (గ్యాప్ ఉండేలా) తెరిచి ఉంచవచ్చు. కానీ పూర్తి చీకటి, ప్రశాంతత కోసం తలుపులు మూసి ఉంచడమే ఆరోగ్యకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Follow Us