
పాలు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటి కాలంలో డెయిరీలో, దుకాణంలో అందరూ పాల ప్యాకెట్లు తెచ్చుకుని వాడుతుంటారు. అయితే ఈ పాలను మరిగించకుండా తాగడం సరైందేనా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. పాల ప్యాకెట్ల నుంచి తీసిన పాలు మరిగించకుండా నేరుగా తాగితే ఏమవుతుంది? ఈ అనుమానం కూడా మీకు చాలా సార్లు వచ్చే ఉంటుంది. పాల ప్యాకెట్లపై సాధారణంగా ‘ పాశ్చరైజ్డ్ ‘, ‘టోన్డ్’ లేదా ‘UHT’ అని లేబుల్ వేస్తుంటారు. ఇందులో పాశ్చరైజ్డ్ పాలను తాగే ముందు మరిగించడం అవసరమా? దీని వల్ల కలిగే నష్టాలు ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం..
పాల ప్యాకెట్‌ను ఒకసారి మరిగించిన తర్వాత రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే, దాన్ని మళ్ళీ మరిగించాల్సిన అవసరం లేదని డైటీషియన్, డయాబెటిస్ విద్యావేత్త కనికా మల్హోత్రా అంటున్నారు. పాశ్చరైజ్డ్ పాలు ఒకసారి వేడి చేశాక మళ్లీ వేడి చేయాల్సిన అవసరం లేదు. అందుకే వాటిని మళ్లీమళ్లీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పలుమార్లు వేడిచేస్తే లేనిపోని ఆరోగ్య సమమ్యలు వస్తాయి. కాబట్టి ప్యాక్ చేసిన పాశ్చరైజ్డ్ పాలు కలుషితమైతే లేదా సరిగా నిల్వ చేయకపోతే మాత్రమే మరిగించాలి. లేదంటే ఒకసారి మరిగిస్తే సరిపోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఆవు ఉంటే దాని పాలను ఎక్కువసార్లు మరిగిస్తే అందులోని పోషకాలు మార్పుకు లోనవుతాయి. ఇలాంటి పాలను నేరుగా కూడా తాగవచ్చు.
పాలను మరిగించడం వల్ల వేడికి సున్నితంగా ఉండే బి విటమిన్లు, బి1, బి2 (రైబోఫ్లేవిన్), బి3, బి6, ఫోలిక్ యాసిడ్‌లు నశిస్తాయి. పోషకాల్లో దాదాపు 36% కోల్పోవల్సి వస్తుంది. పాలలో సాధారణంగా కనిపించే రిబోఫ్లేవిన్ మరిగించిన తర్వాత తగ్గుతుంది. మరిగించడం వల్ల పాలలోని కొన్ని ప్రోటీన్లు మారి, దాని కొవ్వు పదార్థాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ దానిలోని మొత్తం కొవ్వు, మొత్తం కాల్షియం గణనీయంగా మారవు. పాలను మరిగించడం వల్ల పాలలోని బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ పాశ్చరైజ్డ్ పాలను మళ్లీ మళ్లీ మరిగించాల్సిన అవసరం లేదు. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన పాలను త్వరగా వాడుకోవాలి. పాశ్చరైజ్డ్ పాల ప్యాకెట్లలో బ్యాక్టీరియాను చంపడానికి వేడి-చికిత్స చేస్తారు (సాధారణంగా 72°C వద్ద 15 సెకన్ల పాటు మరిగిస్తారు). ప్యాకెట్‌ను అలాగే ఉపయోగించి రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లయితే మళ్లీ మరిగించడం అవసరం లేదు. ఐతే పాలు తాగే ముందు ఎప్పుడూ మరిగించాలనే విషయం మరచిపోకూడదు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.