రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా ఇలా చేయండి.. మీ ముఖం మెరిసిపోతుంది..!

ప్రస్తుత కాలుష్యం, ఒత్తిడి వల్ల ముఖ కాంతి తగ్గిపోతుంది. కానీ రాత్రి పడుకునే ముందు సరైన స్కిన్‌ కేర్ రూటీన్ పాటిస్తే ఉదయం లేచేసరికి మీ ముఖం మళ్లీ ప్రకాశవంతంగా మారుతుంది. కొబ్బరి నూనె మసాజ్, ఫేస్ వాష్, సీరం, మాయిశ్చరైజర్, ఐ క్రీమ్ వంటి సులభమైన పద్ధతులు మీ చర్మానికి సహజ గ్లో ను ఇస్తాయి.

రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా ఇలా చేయండి.. మీ ముఖం మెరిసిపోతుంది..!
Glowing Skin

Updated on: Aug 25, 2025 | 5:52 PM

ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి వల్ల మన ముఖం కాంతిని కోల్పోతుంది. కానీ రాత్రి పడుకునే ముందు ఒక సులభమైన పద్ధతి పాటిస్తే మీ చర్మం మళ్లీ మృదువుగా, తాజాగా మారి మెరుస్తుంది. ప్రకాశవంతమైన ముఖ చర్మం కోసం రాత్రి పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నూనె మసాజ్

రోజంతా ముఖంపై పేరుకుపోయిన మేకప్ లేదా దుమ్మును తీసివేయడానికి.. కొద్దిగా కొబ్బరి నూనెతో నెమ్మదిగా ముఖాన్ని మసాజ్ చేయండి. ఇది చర్మం లోపల ఉన్న దుమ్మును బయటికి తీసుకురావడానికి సహాయపడుతుంది.

ఫేస్ వాష్ 

కొబ్బరి నూనెతో మసాజ్ చేశాక.. ఒక మంచి ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీని వల్ల చర్మం పూర్తిగా పరిశుభ్రంగా మారుతుంది.

సీరం 

ముఖం శుభ్రమైన తర్వాత మీ చర్మానికి సరిపోయే విటమిన్ C సీరం వంటివి రాసుకోండి. సీరం రాసిన తర్వాత మెల్లగా మసాజ్ చేస్తే.. అది చర్మంలో బాగా కలిసిపోతుంది.

మాయిశ్చరైజర్ 

సీరం తర్వాత మీ చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్ రాయండి. ఇది రాత్రంతా మీ చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేస్తుంది.

ఐ క్రీమ్ తప్పనిసరి

కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు లేదా చిన్న గీతలు తగ్గించుకోవాలంటే ఐ క్రీమ్ వాడటం ముఖ్యం. వేళ్లతో మెల్లగా కళ్ళ చుట్టూ మసాజ్ చేయండి.

ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే మీరు ఉదయం లేచేసరికి మీ ముఖం చాలా కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడూ మీ చర్మ రకానికి సరిపోయే ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోండి.

(Note: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్త చర్మ సంరక్షణ పద్ధతిని పాటించే ముందు తప్పకుండా మీ వైద్యుడిని లేదా చర్మ నిపుణుడిని సంప్రదించండి)