Beauty Tips: 30టీస్‌లోనూ టీనేజర్‌లా కనిపించాలా.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం

వయసు పెరగడం, కాలుష్యం, సరైన సంరక్షణ లేకపోవడం చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీని వల్ల చర్మం త్వరగా నల్లబడడం, మొటిమలు, ముడతలు ఏర్పడడం జరుగుతుంది. వీటని తగ్గించేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే అనేక రకాల రాసాయనాలు వాడుతారు. కానీ మన ఇంట్లొ దొరికే కొన్ని వస్తువులతో ఈజీగా చర్మ నిగారింపును పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. వేంటో చూద్దాం పదండి.

Beauty Tips: 30టీస్‌లోనూ టీనేజర్‌లా కనిపించాలా.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం
Homemade Anti Aging Day Cream

Updated on: Jun 14, 2026 | 11:46 AM

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే ఎక్కవ ఏజ్ ఉన్నవారిలా కనిపిస్తారు. 20 ఏళ్లకు ముఖంపై చర్మం వదులుగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకొని మళ్లీ మునపటి ముఖాన్ని పొందేందుకు చాలా మంది బయట దొరికే ఖరీదైన బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతారు. కానీ మంచి ఆహారం తీసుకుంటూ, కేవలం 4 సహజమైన వస్తువులతో తయారు చేసే కొల్లాజెన్ డే క్రీమ్ ఇంట్లోనే మీ చర్మ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును వీటిలో ఉండే పోషకాలు చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేసి, కొల్లాజెన్‌ను పెంచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా మీరు మీ చర్మాన్ని మునపటిలా మార్చుకోవచ్చు.

కొల్లాజెన్ డే క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

  • అలోవెరా జెల్: ఇది చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.
  • బాదం నూనె : ఇందుటో విటమిన్-ఇ, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరిచి, ఫైన్ లైన్స్ తొలగిస్తాయి.
  • విటమిన్ ఇ క్యాప్సూల్: ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించి, స్కిన్ సెల్స్‌ను రిపేర్ చేయడం ద్వారా చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.
  • రోజ్ వాటర్: ఇది చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది, స్కిన్ టోన్ చేస్తుంది అలాగే ముఖంపై సహజమైన కాంతిని తెస్తుంది.

కొల్లాజెన్ డే క్రీమ్ ఎలా తయారు చేయాలి?

ఇవి కూడా చదవండి

మొదట ఒక శుభ్రమైన గిన్నెలో 2 చెంచాల అలోవెరా జెల్ తీసుకోండి. ఇప్పుడు అందులో ఒక విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కట్ చేసి, దానిలోని ఆయిల్‌ను కలపండి.
ఆ తర్వాత 1 చిన్న చెంచా బాదం లేదా కొబ్బరి నూనె మరియు 1 చెంచా రోజ్ వాటర్ వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నింటినీ ఒక స్పూన్ సహాయంతో తెల్లటి క్రీమ్ లాంటి టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయండి. అంతే.. మీ హోమ్‌మేడ్ కొల్లాజెన్ డే క్రీమ్ సిద్ధం అయినట్టే.

ఎలా ఉపయోగించాలి?

ప్రతిరోజూ ఉదయం మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత, ఈ క్రీమ్‌ను కొద్దిగా తీసుకోండి. దీనిని మీ ముఖం, మెడ భాగంలో డాట్స్ పెట్టుకోండి. ఆ తర్వాత తేలికపాటి చేతులతో సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయండి, తద్వారా క్రీమ్ చర్మంలోకి బాగా ఇంకుతుంది. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మం సాగడం తగ్గి, ముఖం బిగుతుగా, కాంతివంతంగా మారుతుంది.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదిక ఆధారంగా అందించబడినవి మాత్రమే.. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీరు వైద్యులను సలహా తీసుకొండి. వీటిని Tv9 దృవీకరించడం లేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us