సంక్రాంతికి సెలవులకు ఊరెళ్తున్న వారికి హెచ్చరిక.. ఈ పనులు చేయడం మర్చిపోకండి..!

సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది నగరాలు, పట్టణాలను వదిలి తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. సెలవులకు ఇంటికి వెళ్లేవారు బయలుదేరే ముందు ఇంట్లో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేయడం, ఫ్రిజ్‌ను ఖాళీ చేయడం, శుభ్రం చేయడం, గ్యాస్ స్టవ్‌ను ఆపివేయడం చాలా అవసరం. పండుగ సంతోషం కోసం మీ సొంతూరు బయలుదేరే ముందు మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకే ఈ విషయాలను గుర్తుంచుకోండి.

సంక్రాంతికి సెలవులకు ఊరెళ్తున్న వారికి హెచ్చరిక.. ఈ పనులు చేయడం మర్చిపోకండి..!
Sankranti Travel Guide

Updated on: Jan 12, 2026 | 5:04 PM

దేశంలోని పెద్ద పండుగ సంక్రాంతి. విద్య, ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారం కోసం పట్టణాలు, నగరాలకు వలస వచ్చిన వారంతా తప్పక తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఇళ్లకు తాళంపెట్టి ఊర్లకు బయల్దేరుతారు. పండుగ సెలవుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇంట్లో ప్రతిదీ గందరగోళంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో, ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు పెరుగుతున్నాయి. ఇంటికి వెళ్ళే తొందరలో చాలా మంది ఎలక్ట్రానిక్ పరికరాలకు పవర్ ఆఫ్ చేయకపోవడం మర్చిపోతుంటారు. మిగిలి పోయిన వస్తువులను ఫ్రిజ్‌లోనే పెట్టేసి వెళ్తుంటారు. వాటిని ఇలాగే వదిలేయడం ప్రమాదాలకు దారితీస్తుంది. అందుకే కొన్ని రోజులు ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు వివిధ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్రిజ్ ను పూర్తిగా ఖాళీ చేసి, శుభ్రం చేయాలి..

పండుగ సందర్భంగా వారం కంటే ఎక్కువ కాలం ఇంటికి వెళ్తున్నవారు ఫ్రిజ్‌ను ఆపివేయాలి. ఫ్రిజ్‌ను పూర్తిగా ఖాళీ చేసి, పూర్తిగా ఆఫ్‌ చేసి ఫ్లగ్‌ తీసేసి వెళ్లాలి. ఫ్రిజ్‌ను పూర్తిగా శుభ్రం చేసి తేమ లేకుండా ఆరనివ్వండి. తలుపులు పూర్తిగా మూసివేయడం సమస్య కావచ్చు. అందువల్ల, గాలి ప్రసరణ కోసం, తువ్వాళ్లు లేదా కాగితం వంటి చిన్న వస్తువులతో ఫ్రిజర్ తలుపులను కొద్దిగా తెరిచి ఉంచండి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, మీరు ఫ్రిజ్‌ను శుభ్రంగా తుడిచి మళ్ళీ ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేయండి…

ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలను నివారించడానికి, అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపివేయాలి. వాటిని పూర్తిగా అన్‌ప్లగ్ చేయడం మంచిది. సర్క్యూట్ బ్రేకర్లను ఉపయోగించడం ద్వారా కూడా ప్రమాదాలను నివారించవచ్చు. అంతేకాకుండా, ఇంట్లో ఎవరూ లేనప్పుడు దొంగతనాలు జరిగే ప్రమాదం ఉంది. అందుకే నగదు, విలువైన నగలను ఇంట్లో కాకుండా బ్యాంకులో లేదా నమ్మకమైన వారి వద్ద ఉంచడం మంచిది.

గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు…

ఎక్కువ రోజులు ఊరెళ్తున్నవారు ఇంట్లో గ్యాస్ ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే, నీటి మోటారును ఆపివేయండి. ఇంటి ముందు ఏర్పాటు చేసిన CCTV కెమెరాల పనితీరును చెక్‌ చేసుకోండి. వాటిని గేటు వైపుకు తిప్పి ఉంచండి. అలాగే, CCTVలో ఏదైనా అనుమానాస్పదంగా గుర్తించినప్పుడు వచ్చిన నోటిఫికేషన్‌లను మీ మొబైల్‌లో ఆన్ చేయండి. మీ పొరుగువారిని ఇంటిపై ఓ కన్నెసి ఉంచమని కోరడం మంచిది.

మీరు ఎక్కువ రోజులు ఇంట్లో లేకుంటే, ఫర్నిచర్, వస్తువులపై దుమ్ము మరియు ధూళి పేరుకుపోతుంది. అందుకే అన్ని కిటికీలు, కర్టెన్లను మూసివేయండి. అలాగే, ఇంట్లోని వస్తువులను గుడ్డ లేదా కాగితంతో కప్పి ఉంచటం మంచిది. మీరు తిరిగి వచ్చినప్పుడు శుభ్రం చేయడం సులభం అవుతుంది. అలాగే, మీరు మొక్కలకు నీరు పెట్టవలసి వస్తే, పొరుగువారికి చెప్పటం మర్చిపోవద్దు.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..