గడ్డేగా అనుకునేరు.. జబ్బులు మాయం చేసే సర్వరోగనివారిణి.. వారి ఆరోగ్య రహస్యం ఇదేనట..

ప్రకృతి.. అందమైన సహజమైన ప్రపంచం.. దాని అందం, వనరులు, జీవవైవిధ్యం.. ఇవన్నీ ఎంతో ప్రసాదించాయి.. ఇది మనకు ఆహారం, గాలి, నీరు అందించి, జీవించడానికి ఆధారం కల్పించింది.. అయితే.. ఈ ఆధునీక ప్రపంచంతో పోలిస్తే.. ప్రకృతికి దగ్గరగా జీవిస్తే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని.. సహజమైన ఆహారంతో దృఢంగా మారొచ్చని.. ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి..

గడ్డేగా అనుకునేరు.. జబ్బులు మాయం చేసే సర్వరోగనివారిణి.. వారి ఆరోగ్య రహస్యం ఇదేనట..
Safed Musli Benefits

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 16, 2025 | 11:27 AM

ప్రకృతి.. అందమైన సహజమైన ప్రపంచం.. దాని అందం, వనరులు, జీవవైవిధ్యం.. ఇవన్నీ ఎంతో ప్రసాదించాయి.. ఇది మనకు ఆహారం, గాలి, నీరు అందించి, జీవించడానికి ఆధారం కల్పించింది.. అయితే.. ఈ ఆధునీక ప్రపంచంతో పోలిస్తే.. ప్రకృతికి దగ్గరగా జీవిస్తే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని.. సహజమైన ఆహారంతో దృఢంగా మారొచ్చని.. ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి.. ఇప్పటికీ.. ప్రకృతికి దగ్గరగా అటవీ ప్రాంతాల్లో జీవించే వారు అలానే కనిపిస్తుంటారు. వారి ఆహారం, జీవన విధానం వారిని అంతటి దృఢంగా మారుస్తుంది.. ముఖ్యంగా.. రసాయన కృత్రిమ పదార్థాలు.. లేకుండా లభించే ఆహార పదార్థాలు వారిని జీవనాన్ని మరింత మెరుగుపరుస్తాయి.. అంతేకాకుండా.. ఔషధాలుగా పనిచేస్తాయి.. ముఖ్యంగా ఏజెన్సీలో ఆదివాసీలు, గిరిజనులు ఆహార అలవాట్లు విభిన్నంగా ఉంటాయి.. అడవుల్లో దొరికే మొక్కలు, ఆకులు, దుంపలు వాటినే ఆహారంగా వండుకొని తింటారు.. ఆకు కూరలు అనగానే మనకు గుర్తు వచ్చేవి తోటకూర, గోంగూర, బచ్చలికూర, పాలకూర, చుక్కకూర ఇవి రెగ్యులర్‌గా మనకు మార్కెట్లో అమ్ముతుంటారు రైతులు.. ఇవి కాక వర్షాకాలం సీజన్లో మాత్రమే వచ్చేవి మరికొన్ని ఆకు కూరలు ఉంటాయి.. కానీ ఈ ఆకు కూర మాత్రం అందుకు భిన్నం. ఈ ఆకు కూరని తింటే రోగాలు నయం అవుతాయంటున్నారు ఆదివాసీ గిరిజనులు..వారి ఆరోగ్య రహస్యం ఇదేనంటూ చెబుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గుండ్లమడుగు అనే వలస గిరిజన గ్రామంలో గడ్డి జాతికి చెందిన ఓ ఆకుకూరను ఇక్కడి గిరిజనులు ఎంతో ఇష్టంగా తింటున్నారు.. పలు రకాలుగా కూరగా వండుకుని తింటారు.. అంతేకాకుండా పచ్చడి చేస్తారు.. ఇంకా ఎండబెట్టి పొడిగా మార్చి నీళ్లలో కలుపుకొని తాగుతుంటారు.. ఇది ఎంతో రుచిగా ఉంటుందని సమీపంలోని వాగులతో పాటు గోదావరి తీరంలో ఎక్కువగా ఈ గడ్డి లభిస్తుందని పేర్కొంటున్నారు.

వీడియో చూడండి..

ఈ గడ్డిలో ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, ఇది తింటే సర్వరోగాలు మాయమైపోతాయనీ చెప్తున్నారు స్థానికులు.. ఆకుకూరల కంటే ఈ గడ్డిలో అధిక పోషకాలు ఉంటాయని, ముఖ్యంగా దాని కాండంలో ఆయుర్వేద గుణాలు ఉంటాయని పేర్కొంటున్నారు. చాలా మంది గడ్డిగా పేర్కొంటారు.. కానీ.. ఇది సఫేద్ ముస్లి అనే జాతికి చెందిన గడ్డి అని.. దానిలో చాలా పోషకాలు దాగున్నాయని వృక్షశాస్త్ర నిపుణులు చెప్తున్నారు..

ఇది కూడా చదవండి : చీపురు ఈ దిక్కున పెడితే ఇంట్లో ఐశ్వర్యం.. డబ్బుకు లోటుండదు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..