Relationship: లైఫ్ పార్ట్‌నర్‌ని చేసుకునే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి..

|

Feb 09, 2022 | 9:47 AM

Relationship: వివాహం అనేది జీవితంలో చాలా పెద్ద నిర్ణయం. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకోవడమనేది చాలా మంచిది. పెద్దలు కుదర్చిన వివాహంలో అబ్బాయి,

Relationship: లైఫ్ పార్ట్‌నర్‌ని చేసుకునే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి..
Relationship
Follow us on

Relationship: వివాహం అనేది జీవితంలో చాలా పెద్ద నిర్ణయం. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకోవడమనేది చాలా మంచిది. పెద్దలు కుదర్చిన వివాహంలో అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు కొద్దికాలం తెలుసుకోవడం తర్వాత వివాహం చేసుకోవడం కనిపిస్తుంది. అయితే చాలా సందర్భాలలో కొంతకాలం తర్వాత సమస్యలు రావడం ప్రారంభమవుతుంది. దీనికి కారణం ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. అలవాట్లు, అభిరుచులు తెలియక చాలామంది పెళ్లి తర్వాత ఇబ్బందిపడుతారు.

1. అబద్ధం చెప్పుట
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా.. భాగస్వామికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే.. ముందు ముందు ఈ అలవాటు పెద్ద సమస్యగా మారుతుంది. దీనివల్ల సంబంధంలో గొడవలు ప్రారంభమవుతాయి. ఇలాంటి వ్యక్తులను వివాహం చేసుకుంటే జీవితంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

2. ప్రాధాన్యత
రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించొద్దు. ఇది మంచిది కాదు. జీవిత భాగస్వామి మాటలకు ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తులను చేసుకుంటే చాలా ఇబ్బంది పడుతారు. మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. లేదంటే చాలా కష్టం.

3. విస్మరించడం
కొంతమంది పని నటిస్తూ పార్ట్‌నర్‌తో మాట్లాడరు. శుభకార్యాలు, వేడుకలని విస్మరిస్తారు. భాగస్వామిపై ఇష్టం లేకుండా అవైడ్‌ చేస్తారు. ఇది ఎదుటివారికి స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి భాగస్వామిని అస్సలు మీ జీవిత భాగస్వామిగా చేసుకోకండి. చాలా బాధపడుతారు.

4. పాత విషయాలు మనసులో పెట్టుకోవడం
కొంతమంది మనసులో పాత విషయాలను ఉంచుకోవడం.. దాని గురించి వారి భాగస్వామితో మాట్లాడకపోవడం తరచుగా కనిపిస్తుంది. కానీ కాలక్రమేణా ఈ విషయాలు మరింత తీవ్రమవుతాయి. సాధారణ వాదన లేదా చికాకు ఉన్నప్పుడు, గొడవకు ఆజ్యం పోసే పాత విషయాలు బయటకు వస్తాయి. ఇలాంటి వారు కూడా ప్రమాదమే.

వాలెంటైన్స్ డేకి స్మార్ట్‌ఫోన్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారా.. 4GB RAMతో వచ్చే ఈ 4 ఫోన్లు సూపర్..?

Wriddhiman Saha: వృద్ధిమాన్ సాహా కెరీర్ ‘ఓవర్‌’.. శ్రీలంక సిరీస్‌కి నో ఛాన్స్‌..

IPL 2021 Highest Paid Players: ఈ ఐదుగురు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది.. అన్ని రికార్డులు బద్దలు..