AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు తింటున్న చీజ్ అసలైనదేనా..? నకిలీ జున్నును ఇలా గుర్తించండి..

చీజ్ దోసె, చీజ్ పిజ్జా, చీజ్ బాల్స్, చీజీ పాస్తా.. ఇలా ఒకటేమిటి ఈ రోజుల్లో హోటల్‌కి వెళ్తే చాలు ప్రతి వంటకంలోనూ చీజ్ ఉంటే ఆ మజానే వేరు అనుకుంటారు ఫుడ్ లవర్స్. అయితే మీరు అంతలా ఇష్టపడి తింటున్న ఆ చీజ్ అసలైనదేనా? లేక మీ ఆరోగ్యానికి చేటు చేసే నకిలీదా..? ఇంట్లోనే సింపుల్‌గా ఇలా గుర్తించండి..

మీరు తింటున్న చీజ్ అసలైనదేనా..? నకిలీ జున్నును ఇలా గుర్తించండి..
How To Identify Fake Cheese At Home
Krishna S
|

Updated on: Jul 06, 2026 | 1:42 PM

Share

ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది చీజ్ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటున్నారు. చీజ్ దోసె, చీజ్ పిజ్జా, చీజ్ బాల్స్, చీజీ పాస్తా, పరాఠా.. ఇలా ఒకటేమిటి ప్రతి వంటకంలోనూ చీజ్ ఉంటే ఆ మజానే వేరు అనుకుంటారు. కానీ మీరు రెస్టారెంట్లలో ఎంతో ఇష్టంగా తినే ఈ చీజ్ అసలైనదేనా? లేక మీ ఆరోగ్యానికి చేటు చేసే నకిలీ చీజ్ వాడుతున్నారా? అసలు కల్తీ చీజ్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

అసలైన చీజ్ vs నకిలీ చీజ్..

అసలైన చీజ్‌ను పక్కాగా పాలతో తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నకిలీ చీజ్‌ను తక్కువ ఖర్చుతో పామాయిల్, వెజిటబుల్ ఆయిల్, స్టార్చ్, పాలపొడితో తయారు చేస్తారు. దీనివల్ల గుండె జబ్బులు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

ల్యాబ్ అక్కర్లేదు.. ఇంట్లోనే ఈ 6 పరీక్షలతో తేల్చేయండి.

మార్కెట్లో లభించే చీజ్ క్వాలిటీని చెక్ చేయడానికి ల్యాబ్‌లకు వెళ్లక్కర్లేదు. మీ వంటగదిలోనే ఈ చిన్న చిన్న టెస్టులతో కనిపెట్టేయవచ్చు.

ప్యాకెట్ లేబుల్ చెక్ చేయండి

చీజ్ కొనేముందు ప్యాకెట్ వెనుక ఉన్న లేబుల్‌ను జాగ్రత్తగా గమనించండి. దానిపై ప్రాసెస్డ్ చీజ్ ఫుడ్ ప్రొడక్ట్ లేదా అనలాగ్ చీజ్ అని రాసి ఉంటే అది నకిలీది లేదా వెజిటబుల్ ఆయిల్‌తో చేసిన చీజ్ అని అర్థం.

వేడి నీటి పరీక్ష

కొన్ని చీజ్ ముక్కలను తీసుకుని సుమారు 10 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచండి. అది గనుక అసలైన చీజ్ అయితే.. వేడి నీటిలో నెమ్మదిగా కరిగి, తన సహజ సిద్ధమైన పాల రంగును నిలుపుకుంటుంది.

అరచేతితో రుద్దే పరీక్ష

ఒక చిన్న చీజ్ ముక్కను మీ అరచేతిలో తీసుకుని కొద్దిగా రుద్ది చూడండి. ఆ ముక్క విరిగిపోవడం లేదా అందులో పగుళ్లు రావడం జరిగితే, అది మీగడ తీసిన పాలపొడితో చేసిన కల్తీ చీజ్. అదే అసలైన చీజ్ అయితే రుద్దినప్పుడు నునుపుగా, క్రీములా మారుతుంది.

కరిగే గుణం

మీ ఇంట్లో మైక్రోవేవ్ ఉంటే అందులో లేదా దోస పెనం, శాండ్‌విచ్ మేకర్‌పై చీజ్ ముక్కను ఉంచి వేడి చేయండి. అసలైన చీజ్ ప్యూర్ పాలతో తయారవుతుంది కాబట్టి వేడి తగలగానే చాలా త్వరగా కరిగిపోతుంది. అదే నకిలీదైతే సరిగ్గా కరగదు సరే కదా.. వింతగా జిగురుగా మారుతుంది.

అయోడిన్ పరీక్ష

చీజ్ ముక్కపై కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం వేయండి. ఆ జున్ను ముక్క గనుక నీలం లేదా నలుపు రంగులోకి మారితే, అందులో పిండిపదార్థం కలిపిన నకిలీ చీజ్ అని అర్థం. అసలైన జున్ను అయితే తన తెల్లని క్రీము రంగును అస్సలు కోల్పోదు.

కాగా బయట రెస్టారెంట్లలో చీజ్ వంటకాలు ఆర్డర్ చేసేటప్పుడు వాటి ధరలు మరీ తక్కువగా ఉంటే కాస్త అనుమానించాల్సిందే. ఎందుకంటే తక్కువ ధరలో ఎక్కువ చీజ్ ఇస్తున్నారంటే అది కచ్చితంగా నకిలీ అనలాగ్ చీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి తినే ఆహారం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Follow Us