జంతువుల కాటు అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. వాటిలో ఒకటి రేబిస్. ఇది మనిషి మరణానికి కూడా దారి తీస్తుంది. అలాంటి రేబిస్‌కు సరైన చికిత్స అందుబాటులో లేదు. రేబిస్ వల్ల చాలా మంది చనిపోతున్న వార్తలు ప్రతినిత్యం అనేకం వింటుంటాం. రేబిస్ అనేది జంతువుల వల్ల కలిగే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది వాటి కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. రేబిస్‌కు సకాలంలో చికిత్స చేయకపోతే, అది ప్రాణాంతకంగా మారుతుంది. చాలా సందర్భాల్లో రేబిస్ బారినపడ్డ బాధితులు మరణిస్తున్నారు. పిచ్చి కుక్క కరిచిన ఎన్ని రోజుల తరువాత వ్యాధి తీవ్రత, మరణ ప్రమాదం ఉంటుంది..? మీరు దానిని ఎలా నివారించాలో తెలుసుకోవటం తప్పనిసరి.
2023లో ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 14 ఏళ్ల చిన్నారి రేబిస్‌తో మరణించింది. హృదయ విదారకమైన ఈ వార్త ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. వాస్తవానికి నెల రోజుల క్రితం చిన్నారిని కుక్క కరిచింది. సకాలంలో చికిత్స జరగకపోవడంతో రేబిస్ ఇన్ఫెక్షన్ పెరుగుతూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత, ఆ చిన్నారిలో వింత లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. అతను గాలి, నీటికి కూడా భయపడిపోయాడు. కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించే సమయానికి చాలా ఆలస్యం కావడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
రేబిస్ అంటే ఏమిటి..?
రేబిస్ అనే ఇన్ఫెక్షన్ ప్రధానంగా జంతువులలో కనిపిస్తుంది. అయితే ఈ వైరస్ సోకిన జంతువుల నుండి కూడా అది మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. రేబిస్ సోకిన జంతువు మనిషిని కాటు వేసినప్పుడు లేదా దాని లాలాజలంతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఈ వైరస్ మనిషికి కూడా వ్యాపిస్తుంది. సాధారణంగా దీని లక్షణాలు ఒకటి నుండి మూడు నెలల్లో కనిపిస్తాయి. ఈ సమయంలో చికిత్స తీసుకోకపోతే, సరైన ఇంజెక్షన్లు ఇవ్వకపోతే అప్పుడు మరణం సంభవించే ప్రమాదం ఉంది.
ఏ జంతువులు రేబిస్‌ను వ్యాప్తి చేయగలవు?
రేబిస్ ఏ జంతువులకు వస్తుంది. దాని నుండి మనం ఎలా రక్షించుకోవాలి? అనే విషయంలోనూప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవగాహన ఉండాలి. రేబిస్ వ్యాధి సాధారణంగా కుక్కలు, కోతులు, పిల్లులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అవి మనుషుల చుట్టూ నివసిస్తాయని అంటున్నారు. అవి కరిచినప్పుడు రేబిస్ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
జంతువు కరిచినట్లయితే మొదట ఏం చేయాలి?
మీరు కుక్క, పిల్లి లేదా కోతి కరిచినట్లయితే మొదట మీరు ఆ ప్రాంతాన్ని బాగా కడగాలి. దీని కోసం మీరు సబ్బు లేదా డిటర్జెంట్‌ను ఉపయోగించవచ్చు. గాయం చాలా లోతుగా ఉంటే, మొదట దానిని సబ్బుతో రుద్ది కడగాలి. ఆపై బెటాడిన్ అప్లై చేయాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. రేబిస్, యాంటీబాడీ, టెటానస్ ఇంజెక్షన్ కోసం సరైన టీకాను తీసుకోవాలి. ఏదైనా జంతువు కాటు వేసిన 24 గంటలలోపు మీరు టీకాను వేయించుకోవాలి. నాలుగు నుండి ఐదు మోతాదుల కోర్సును పూర్తి చేయాలి. కుక్క కాటు తర్వాత, ఐదు ఇంజెక్షన్లు అవసరం.
రేబిస్ ప్రధాన లక్షణాలు:
నొప్పి, అలసట, తలనొప్పి, జ్వరం, కండరాలు దృఢత్వం, చిరాకు, దూకుడు స్వభావం, వింత కార్యకలాపాలు చేయడం, పక్షవాతం, నోటి నుండి నీళ్లు కారడం, కన్నీళ్లు ఎక్కువగా కారడం, ప్రకాశవంతమైన కాంతి లేదా చికాకు వంటి విషయాలు రేబిస్ ప్రధాన లక్షణాలు. మాట్లాడటంలో ఇబ్బంది కూడా ఏర్పడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..