తలకు గోరింటాకు వాడుతున్నారా? ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా అసలు నిజాలు ఇవే!

మన దేశంలో జుట్టు సంరక్షణ అనగానే మొదట గుర్తువచ్చేది సహజ సిద్ధమైన గోరింటాకు. తెల్ల జుట్టును కవర్ చేయడానికి, జుట్టును ఒత్తుగా, మృదువుగా మార్చడానికి చాలామంది హెన్నాను ఎంచుకుంటారు. అయితే మార్కెట్లో దొరికే అన్ని హెన్నా పౌడర్లు ఒకేలా ఉండవు. ప్యూర్ హెన్నాకు, తక్షణ నలుపు రంగునిచ్చే బ్లాక్ హెన్నాకు మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

తలకు గోరింటాకు వాడుతున్నారా? ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా అసలు నిజాలు ఇవే!
Pure Henna Vs Black Henna

Updated on: Aug 26, 2026 | 6:13 PM

జుట్టు రంగు వేయడానికి, కుదుళ్లను బలోపేతం చేయడానికి గోరింటాకు.. ఇదే హెన్నా అనాదిగా వాడుతున్నారు. అయితే, మార్కెట్లో దొరికే సాధారణ హెన్నాకు, నల్లటి రంగునిచ్చే బ్లాక్ హెన్నాకు చాలా వ్యత్యాసం ఉంది. ప్యూర్ హెన్నా జుట్టుకు ఎరుపు లేదా ఆరెంజ్ రంగును ఇస్తుంది. కానీ, తక్షణమే నలుపు రంగు ఇస్తామనే కొన్ని బ్లాక్ హెన్నాలలో కొన్ని ప్రమాదకర రసాయనాలు కలుపుతారు. ఇది చర్మంపై తీవ్రమైన అలర్జీలు, దురద, జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. కాబట్టి, హెన్నాను తలకు పట్టించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయడం ఎంతో ముఖ్యం. అందుకే ప్యూర్ హెన్నా- బ్లాక్ హెన్నా మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇది పూర్తిగా సహజమైనది. మెహెండి ఆకులను ఎండబెట్టి చేసిన ఈ పొడి జుట్టుకు ఎరుపు లేదా ఆరెంజ్ రంగును ఇస్తుంది. ఇది కుదుళ్లకు కుదురును బలోపేతం చేసి మంచి షైనింగ్ ఇస్తుంది. కేవలం పది నిమిషాల్లో జుట్టును నల్లగా మారుస్తామనే ప్యాకెట్లలో ప్యూర్ హెన్నా ఉండదు. వాటిలో రంగు త్వరగా రావడానికి PPD అనే ప్రమాదకర రసాయన రంగులను కలుపుతారు.

PPD వల్ల కలిగే నష్టాలు:

బ్లాక్ హెన్నాలో వాడే పీపీడీ (PPD) వల్ల తలపై తీవ్రమైన దురద, మంట, దద్దుర్లు, అలెర్జీలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఇది చర్మ క్యాన్సర్‌కు లేదా తీవ్రమైన హెయిర్ లాస్‌కు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తక్షణ నలుపు రంగు ఇచ్చే రసాయన హెన్నాలకు దూరంగా ఉండటం మంచిది. ఏదైనా కొత్త హెన్నా బ్రాండ్ లేదా సహజమైన మెహెండిని తలకు పెట్టే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం అత్యంత ముఖ్యం.

ఇవి కూడా చదవండి

కొద్దిగా కలిపిన హెన్నా పేస్ట్‌ను చెవి వెనుక భాగంలో లేదా చేతి మణికట్టుపై రాయండి. దానిని 24 గంటల పాటు అలాగే ఉంచి గమనించండి. ఒకవేళ ఎలాంటి దురద, మంట లేదా ఎరుపుదనం రాకపోతేనే అది మీ చర్మానికి సురక్షితమైనదని భావించి తలకు ఉపయోగించవచ్చు. సహజమైన పద్ధతిలో అందమైన జుట్టును పొందాలనుకునేవారు కెమికల్స్ లేని స్వచ్ఛమైన ఆకుల పొడిని ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన, మెరిసే కురులను సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us