Pseudo Dementia: ప్రతి చిన్న విషయం మర్చిపోతున్నారా? మీకూ సూడో డిమెన్షియా ఉన్నట్లే..

|

Sep 24, 2023 | 12:40 PM

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మతి మరుపు చవిచూసిన వారే. ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. ఒకటో.. రెండో విషయాలు మర్చిపోతే పర్లేదు. అయితే ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతే మాత్రం కొంచెం ఆలోచించవల్సిందే. ఉదాహరణకు వ్యక్తుల పేర్లు, ఫోన్ లేదా ఇంటి తాళం ఎక్కడ పెట్టరో.. భోజనం చేశారో లేదో వంటి చిన్నచిన్న విషయాలు కూడా మీరు గుర్తుంచుకోలేకపోతే ఈ విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు పెరుగుతుంది. చాలామందికి చిన్న వయస్సులోనే మతిమరుపు బారీన..

Pseudo Dementia: ప్రతి చిన్న విషయం మర్చిపోతున్నారా? మీకూ సూడో డిమెన్షియా ఉన్నట్లే..
Pseudo Dementia
Follow us on

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మతి మరుపు చవిచూసిన వారే. ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవడం ఎవరికీ సాధ్యంకాదు. ఒకటో.. రెండో విషయాలు మర్చిపోతే పర్లేదు. అయితే ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతే మాత్రం కొంచెం ఆలోచించవల్సిందే. ఉదాహరణకు వ్యక్తుల పేర్లు, ఫోన్ లేదా ఇంటి తాళం ఎక్కడ పెట్టరో.. భోజనం చేశారో లేదో వంటి చిన్నచిన్న విషయాలు కూడా మీరు గుర్తుంచుకోలేకపోతే ఈ విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు పెరుగుతుంది. చాలామందికి చిన్న వయస్సులోనే మతిమరుపు బారీన పడుతుంటారు. ఇటువంటి వారిలో ‘సూడో-డిమెన్షియా’ అభివృద్ధి చెందే ప్రమాదం ఉందంటున్నాయి తాజా అధ్యయనాలు. అవును, మీరు విన్నది నిజమే.. ‘సూడో డిమెన్షియా’ ప్రస్తుతం యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అసలు సూడో డిమెన్షియా ఎందుకు వస్తుంది? ఎలా వస్తుందనే విషయాల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి…

తాజా అధ్యయనాల ప్రకారం సూడో డిమెన్షియాకు ప్రధాన కారణం అధిక ఒత్తిడి. మరో రకంగా చెప్పాలంటే నేటి బిజీ లైఫ్‌లో పనులను చక్కబెట్టుకోవడానికి చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మెదడుపై దీని ప్రభావం వల్ల మల్టీ టాస్కింగ్ చేయలేక స్ట్రెస్‌కు గురవుతున్నారు. నేటి తరం యువతలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫలితంగా మానసిక ఒత్తిడి ఎక్కువవుతోంది. అయితే ఇది మెదుడతో సంబంధం కలిగి ఉండదు. ఎందుకంటే కేవలం మతి మరుపువల్లనే మెదడు క్షీణత ఉండదు. అధిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రభావం వల్ల మతిమరుపు, అతిగా ఆలోచించడం, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ..

ఈ రోజుల్లో అధిక పని ఒత్తిడి, కెరీర్‌ సంబంధిత ఒత్తిడి, సామాజిక స్థితి గురించిన ఆలోచనలవల్ల మెదడుపై ఒత్తిడి కలిగిస్తుంది. ఇది సమాచారాన్ని ప్రాసెస్‌ చేయడంలో ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. మరోరకంగా చెప్పాలంటే మల్టీటాస్కింగ్‌ కూడా ఫోకస్‌ కోల్పోవడానికి దారీ తీస్తుంది. ఇలా మల్టీ టాస్కింగ్‌ పనుల వల్ల నేటి యువత తమకు తెలియకుండానే నకిలీ డిమెన్షియా వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేసుకోలేకపోవడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. నిజానికి మన మెదడు మూడు భాగాలుగా పనిచేస్తుంది. ఏదో ఒకదానిపై దృష్టి పెట్టడం, దానిని స్వీకరించడం, దానిని అలాగే మెదడులో నిక్షిప్తం చేసుకోవడం. ఈ ప్రతి పనికి మెదడు విడిగా పనిచేయవలసి ఉంటుంది. అధిక ఒత్తిడికి గురైనప్పుడల్లా, సాధారణ మెదడు పనితీరు దెబ్బతింటుంది. కౌన్సెలింగ్ లేదా బిహేవియరల్ థెరపీ ఈ సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది. మీకు కూడా ఈ రకమైన మతిమరుపు సమస్య ఉంటే.. సాధారణ విషయంగా కొట్టిపారేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించి కౌన్సెలింగ్‌ తీసుకోవడం ప్రారంభించండి.

ఇవి కూడా చదవండి

సర్ గంగా రామ్ హాస్పిటల్ క్లినికల్ సైకాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆర్తీ ఆనంద్ ఏం చెబుతున్నారంటే.. నెలలో 10-12 మంది రోగులు ఈ వ్యాధితో నా దగ్డరకు వస్తుంటారు. అధిక పని ఒత్తిడి, ప్రతికూల ఆలోచన, అతిగా ఆలోచించడం, వ్యక్తుల మధ్య సమస్యల కారణంగా వారిలో ఆందోళన క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఆందోళనగా ఉన్నప్పుడు పనులు సక్రమంగా చేయలేరు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోతారు. ఇది రోజువారీ పనితీరును ప్రభావితం చేస్తుంది. కౌన్సెలింగ్ సెషన్‌లు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఈ స్థితి నుంచి బయటపడవచ్చని అంటున్నారు. అధిక మంది యువత లైఫ్‌స్టైల్‌ ఒత్తిడికి గురవుతున్నారు. అది వ్యక్తిగతమైనా, వృత్తిపరమైన, ఆర్థికమైనా కావచ్చు. ఇది ఆందోళనకరమైనదే కానీ తగిన సమయంలో చికిత్స తీసుకుంటే నివరించవచ్చని అంటున్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.