పిల్లల సరైన ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల శారీరక ఎదుగుదల పైనే కాదు మానసిక ఎదుగుదలపై కూడా ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రులు తమ బిడ్డ ఆహారం తినడం లేదని తరచుగా ఫిర్యాదు చేస్తారు. వాస్తవానికి.. చాలా మంది పిల్లలలో ఆకలిని సమస్య కనిపిస్తుంది. అప్పుడు వైద్యులు సూచించిన టానిక్‌లను కూడా ఉపయోగిస్తారు. అయితే కొన్ని ఇంటి నివారణ చిట్కాలు పిల్లల ఆకలిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతేకాదు ఈ రెమెడీస్‌లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి కనుక ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి.
పిల్లల్లో ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే శరీరంలో పోషకాల లోపం ఏర్పడి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని భయం. పోషకాల కొరత కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. వైరల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. కనుక పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఏం ఇవ్వాలో తెలుసుకుందాం.
సోపు చక్కెర మిఠాయి
పిల్లలకు రోజూ సోపు, పంచదార మిఠాయి ఇవ్వవచ్చు. ఈ రెండు వస్తువుల గుణాలు అద్భుతంగా ఉండటమే కాదు..రుచి పరంగా కూడా వీటి కలయిక బాగుంటుంది. అందుకే పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. సోంపు మిశ్రి పిల్లలకు రోజూ ఉదయం, సాయంత్రం లేదా ఎప్పుడైనా తినడానికి ఇవ్వవచ్చు. ఇవి ఆకలిని పెంచడమే కాదు కళ్లకు కూడా మేలు చేస్తాయి. కడుపులో వేడి తగ్గి జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
పాలలో యాలకుల పొడి
పిల్లలు ఆకలి లేదు.. ఏమీ తినం అంటూ మారాం చేస్తుంటే రోజు తాగే పాలలో కొంచెం నల్ల యలకుల పొడిని కలిపి ఇవ్వండి. ఇలా పిల్లలకు పాలు ఇచ్చిన ప్రతిసారీ.. పాలకు కొద్దిగా నల్ల యాలకుల పొడిని జోడించడం వల్ల ఆకలి పెరుగుతుంది.
ఉసిరికాయ
పుల్లని రుచి కలిగిన ఉసిరి విటమిన్ సి ఉండే అద్భుతమైన మూలకంగా పరిగణిస్తారు. ఉసిరిలో ఐరన్, కాల్షియం వంటి అనేక పోషకాలు కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి వరం కంటే తక్కువ కాదు. కొద్దిగా ఉసిరి పొడి.. ఒక చెంచా తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి రోజూ పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా చేయడం వలన పిల్లలకు ఆకలి పెరగడమే కాదు పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.
జీలకర్ర పొడి, నల్ల ఉప్పు
పిల్లల ఆకలిని పెంచడానికి జీలకర్ర పొడి నల్ల ఉప్పు ఇవ్వవచ్చు. ముందుగా బాణలిలో జీలకర్ర వేసి వేయించి.. రోజూ నల్ల ఉప్పును గ్రైండ్ చేసి ఆ పొడిలో కలిపి ఇవ్వాలి. ఈ పొడిని సరైన నిష్పత్తిలో చేసి పెట్టెలో భద్రపరుచుకోండి. పిల్లలు తినే ఆహారంలో ఈ పొడిని కొంచెం కలిపి ఇవ్వవచ్చు. ఇలా చేయడం వలన ఆహారం రుచి పెరుగుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది క్రమంగా పిల్లల్లో ఆకలిని పెంచుతుంది. కావాలంటే గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కొద్దిగా కలుపుకుని తాగడానికి కూడా ఇవ్వొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..