ఈ వస్తువులను పంచుకోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా..? మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వ్యక్తిగత వస్తువులను ఎవరితోనూ పంచుకోవద్దని చెబుతారు. ఇవి పంచుకోవడం వల్ల మన అదృష్టం తగ్గిపోవచ్చు, ప్రతికూల శక్తులు చేరొచ్చని నమ్మకం. ముఖ్యంగా గడియారం, చెప్పులు, చీపురు, దుస్తులు, ఉంగరాలు వంటి వస్తువులు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇవి ఎందుకు పంచుకోవద్దో తెలుసుకుందాం.

ఈ వస్తువులను పంచుకోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా..? మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
Vastu Tips

Updated on: Feb 24, 2025 | 9:14 AM

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వ్యక్తిగత వస్తువులను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇవి పంచుకోవడం వల్ల మన జీవితంలో దురదృష్టం, ప్రతికూల శక్తులు చేరుతాయని నమ్మకం. కొన్ని వస్తువులు మన అదృష్టాన్ని దోచుకుంటే మరికొన్ని ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెబుతారు.

గడియారం

గడియారాన్ని ఎవరికి ఇచ్చినా, ఎవరి గడియారాన్ని తీసుకున్నా అనర్థమే. వాస్తు ప్రకారం గడియారం కేవలం సమయాన్ని చెప్పడానికి కాదు. అది మన జీవితంలో ఉన్న శుభ, అశుభ సమయాల‌ను సూచిస్తుంది. ఒక వ్యక్తి చెడు దశలో ఉన్నప్పుడు అతని గడియారాన్ని ధరిస్తే ఆ ప్రతికూల శక్తి మనపై ప్రభావం చూపుతుంది. అదే విధంగా మన గడియారాన్ని వేరొకరు వాడితే మన అదృష్టం వారివైపు వెళ్లిపోతుందని నమ్ముతారు.

చెప్పులు, బూట్లు

ఎవరైనా చెప్పులు, బూట్లు అడిగినా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల శని ప్రభావం పెరిగి జీవితంలో అనుకోని ఇబ్బందులు రావచ్చని అంటారు. చెప్పులు మన దారిని సూచిస్తాయి. కనుక అవి ఇతరులకు ఇచ్చినప్పుడు మన జీవితంలో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది.

చీపురు

వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని నమ్మకం. ఇంట్లో దరిద్రాన్ని తొలగించడానికి చీపురుని ఉపయోగిస్తారు. అయితే దీనిని ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కుంగిపోతుందని, తద్వారా దరిద్రం పెరిగే అవకాశముందని అంటారు. చీపురు ఉపయోగించేటప్పుడు కూడా దానిని శుభ సమయాల్లో మాత్రమే మార్చాలని సూచిస్తారు.

దుస్తులు

పెండ్లి దుస్తులను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇవి వ్యక్తిగత శుభాన్ని సూచిస్తాయి. కనుక ఇతరులకు ఇచ్చినప్పుడు మన వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చని నమ్ముతారు. అలాగే రోజువారీ దుస్తులను కూడా ఎవరితోనూ పంచుకోవద్దు. మన శరీరంలో ఉష్ణోగ్రత, శరీరధ్వని దుస్తుల ద్వారా నిలుస్తాయి. ఇతరులు మన దుస్తులను వాడితే మన శక్తి తగ్గిపోతుందని, మన అదృష్టం క్షీణిస్తుందని అంటారు.

సుగంధ ద్రవ్యం

సుగంధ ద్రవ్యం మన మనసుకు, వ్యక్తిత్వానికి మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. అయితే దీన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ఇతరులకు ఇచ్చినప్పుడు మన శరీరంలోని సహజ గుణాలు మారతాయని, మన ఆకర్షణ తగ్గిపోతుందని నమ్మకం.

ఉంగరాలు, గాజులు

తొడిగే ఉంగరాలు, గాజులను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇవి మన జీవనశైలికి సంబంధించి శుభశక్తిని కలిగి ఉంటాయి. ఇతరులకు ఇచ్చినప్పుడు మన ఆరోగ్యం, ఆర్థిక స్థితి దెబ్బతింటాయని అంటారు.

పెన్ను

పెన్ను విద్య, జ్ఞానం, విజయానికి దారి చూపిస్తుంది. తన ప్రియమైన పెన్నును ఎవరికి ఇచ్చినా తన విజయం వేరొకరికి వెళ్ళిపోతుందని నమ్ముతారు. దీన్ని ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు పాటించడం మంచిది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)