
చలికాలం స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్‌లో జామ పండ్లు ఎక్కవగా లభిస్తుండటంతో చాలా మంది వీటిని ఎక్కవగా తింటారు. ఇది చాలా చౌకగా దొరకడం, అంతే కాకుండా తినడానికి చాలా రుచిగా ఉండటం వలన దీనిని తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా జామ కాయ పోషకాల గని, ఎందుకంటే? ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ , పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

అలాగే జామకాయ తినడం వలన అనేక సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా మంచిది. ప్రతి రోజూ ఉదయం జామకాయ తినడం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేసి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది డయాబెటీస్ పెషెంట్స్ కు కూడా బెస్ట్ ఫ్రూట్.

డయాబెటీస్ వ్యాధితో బాధపడే వారు ప్రతి రోజూ రెండు జామకాయలను ఉదయం తినడం వలన ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది. అందుకే చాలా మంది వైద్యులు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క జామకాయ అయినా తినాలని చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రం వీటిని తినకూడదు.వారు ఎవరంటే?

ఎవరైతే అలెర్జీ వంటి సమస్యలతో బాధపడుతుంటారో వారు జామకాయ తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. అలెర్జీ సమస్యలు ఉన్న వారు జామకాయలు తినడం వలన ఇది శరీరంపై మంట , దద్దర్లు, వాపు వంటి లక్షణాలను కలిగిస్తుందంట. అందుకే అలెర్జీ ఉన్నవారు జామ పండ్లు అతిగా తినకూడదు.

అదే విధంగా, గ్యాస్ట్రిక్, జలుబు దగ్గు సమస్యలు, శ్వాస కోశ వ్యాధులతో బాధపడే వారు, గర్భిణీలు కూడా జామ పండ్లను తినకపోవడం చాలా వరకు మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్యాస్ట్రీక్ సమ్య ఉన్న వారు జామకాయ తినడం వలన ఇది కడుపునొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుంది.