
మినుములు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దీనితోనే మనం రోజూ ఉదయం దోస, ఇడ్లీ ఇలా రక రకాల టిఫిన్స్ ను చేసుకుని తింటున్నాము. ఎందుకంటే, దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.

కండరాల బలం, శరీర పనితీరుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మినుములను ఏదొక రూపంలో రోజూ తీసుకోవడం వలన కావాల్సిన శక్తి మన శరీరానికి దొరుకుతుంది. అంతే కాదు, దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

మనం పప్పు ఎలా వండుకుని తింటామో అలాగే కొన్ని ప్రదేశాల్లో దీన్ని అలా వండుకుని తింటారు. వీటిలో పహాడీ దాల్ అని పిలవబడే వంటకం ఒకటి. దీనిని ఎక్కువగా ఉత్తరాఖండ్ ప్రజలు ఇష్టంగా తింటారు.

కాకపోతే దీన్ని పహాడీ స్టైల్లో చేసుకోవాలి. అంటే మనం టమోటా పప్పు ఎలా వండుకుంటామో అలానే ఇక్కడ కంది పప్పుకు బదులు మినుములు, సుగంధ ద్రవ్యాలు వేసి వండుతారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.

ఈ పహాడీ దాల్ ను అన్నంతో తింటే రుచి కరంగా ఉంటుంది. దీనిని తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. ఎప్పుడూ ఒకటే ఫుడ్స్ కాకుండా కొత్తవి కూడా ట్రై చేసి తింటూ ఉండాలి.