మన డైలీ రొటీన్‌లో ప్లాస్టిక్ వస్తువులనే ఎక్కువగా వాడుతున్నామని ఎప్పుడైనా మీరు గమనించారా.? తాగడం దగ్గర నుంచి తినడం వరకు అన్నీ కూడా ప్లాస్టిక్ వాటిల్లోనే తీసుకుంటుంటాం. ఆఫీసుల్లో, ఇంట్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్సే. తాగే నీరు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతుంటాం. అంతేకాకుండా ఆహారం కూడా ప్లాస్టిక్ ప్లేట్లలో తింటుంటాం. ఇలా మన జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయింది.
అయితే ఇలా ప్లాస్టిక్ వాటిల్లో తినడం, తాగడం వల్ల మన ప్రాణానికి ఎంతో ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. వీటి వల్ల మనకు తెలియకుండానే ప్లాస్టిక్ సూక్ష్మకణాలు శరీరంలోకి చేరిపోతాయని అమెరికన్ పరిశోధకులు ఓ పరిశోధన ద్వారా కనుగున్నారు. ఈ అధ్యయనంలో కొంతమంది మీద వారు పరిశోధన జరపగా.. వారి మూత్రంలో 44 రెట్లు ఎక్కువగా ప్లాస్టిక్ సూక్ష్మ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందువల్ల సంతానోత్పత్తి, మెదడు పనితీరు దెబ్బతింటుందని.. అంతేకాకుండా కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇక భారత్‌లో విక్రయించే ప్యాకేజ్డ్ ఆహార పదార్ధాలు, ఫాస్ట్ ఫుడ్‌లలో ఉప్పు, కొవ్వు, చక్కర స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తినేవారు ఒబేసిటీ, గుండెకు సంబంధిత రోగాలు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతారని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. సో ప్లాస్టిక్, ప్యాకేజ్డ్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
Also Read: కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!