ముఖంపై ముడతలు చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. అలాంటి ముడతలు రాకుండా ఉండాలంటే ఓట్ మీల్ ను ముఖానికి రాసుకోవడం మంచిది. ఓట్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ముఖం ముడుతలను తగ్గించి, నల్లని ఛాయను నివారించడంలో సహాయపడతాయి. ఓట్స్‌లో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఓట్స్ చర్మాన్ని పునరుజ్జీవింపజేసి పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడుతుంది. మీ ముఖంపై ముడతలు పోగొట్టుకోవడానికి కొన్ని ఓట్ మీల్ ఫేస్ ప్యాక్‌లను తెలుసుకుందాం…
సగం అరటి పండు, ఒక టీస్పూన్ ఓట్స్, టీస్పూన్ పాలు, టీస్పూన్ తేనె వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మంపై ముడతలు, గీతలు మరియు మచ్చలను తగ్గించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
ఒక టీస్పూన్ వోట్ మీల్‌లో ఒక టీస్పూన్ పెరుగు, గ్రౌండ్ బాదం, తేనె కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది.
ఒక టీస్పూన్ అలోవెరా జెల్, రెండు టీస్పూన్ల ఓట్ మీల్ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవచ్చు. ఈ ప్యాక్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..