మెరిసే చర్మం కోం.. వేల రూపాయల పార్లర్‌ ఖర్చు దండగ..ఇంట్లోనే పెరుగు, శనగపిండితో ఈజీ ఫేషియల్!

అందం, కాంతివంతమైన చర్మం కోసం పార్లర్లలో వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోని వంటగదిలో ఉండే పెరుగు మరియు శనగపిండితో సులభంగా ఫేషియల్ చేసుకోవచ్చు. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరిచి, మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. శనగపిండి చర్మ రంగును మెరుగుపరుస్తుంది. పెరుగు, శనగపిండిని ఉపయోగించి ఇంట్లోనే మూడు సులభమైన దశల్లో క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, ఫేస్ ప్యాక్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో, తద్వారా నిగారింపు, మెరుస్తున్న చర్మాన్ని ఎలా పొందాలో వివరంగా చూద్దాం..

మెరిసే చర్మం కోం.. వేల రూపాయల పార్లర్‌ ఖర్చు దండగ..ఇంట్లోనే పెరుగు, శనగపిండితో ఈజీ ఫేషియల్!
Curd And Besan Facial

Updated on: Nov 12, 2026 | 9:02 PM

ప్రతి ఒక్కరూ కాంతివంతమైన,అందమైన చర్మాన్ని కోరుకుంటారు. ఇందుకోసం చాలామంది తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి ఫేషియల్స్, క్లీనప్‌లు చేయించుకుంటారు. అయితే, ఈ ఖరీదైన ట్రీట్‌మెంట్ల ప్రభావం కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. కానీ, మన ఇంట్లోని వంటగదిలో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే పార్లర్ కంటే మెరుగైన నిగారింపును పొందవచ్చు. ముఖ్యంగా పెరుగు, శనగపిండి కాంబినేషన్ చర్మ సంరక్షణకు అత్యుత్తమమైనది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, మృతకణాలను తొలగిస్తే.. శనగపిండి చర్మ రంగును మెరుగుపరిచి, జిడ్డును తగ్గిస్తుంది. పెరుగు, శనగపిండితో ఇంట్లోనే ఫేషియల్ చేసుకునే సులభమైన విధానం గురించి తెలుసుకుందాం.

హోమ్ మేడ్ పెరుగు – శనగపిండి ఫేషియల్ విధానం:

ఈ ఫేషియల్ మూడు దశల్లో ఉంటుంది.

క్లెన్సింగ్

ఫేషియల్‌ను క్లెన్సింగ్‌తో ప్రారంభించాలి. ముందుగా ఒక చెంచా పెరుగును తీసుకుని ముఖం, మెడకు అప్లై చేయండి. ఐదు నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయండి. ఇది చర్మంపై ఉన్న ధూళి, కాలుష్యం, అదనపు నూనెను తొలగించి, రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఆ తర్వాత ముఖాన్ని తడి గుడ్డతో తుడుచుకోండి.

ఇవి కూడా చదవండి

స్క్రబ్బింగ్

ఒక చెంచా పెరుగులో కొద్దిగా పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి, వేళ్లతో మెల్లగా వృత్తాకారంలో స్క్రబ్ చేయండి. పంచదార రేణువులు చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి.

ఫేస్ ప్యాక్

ఇది ఫేషియల్‌లో అత్యంత ముఖ్యమైన దశ. ఒక గిన్నెలో ఒక చెంచా శనగపిండి, ఒక చెంచా పెరుగు, చిటికెడు పసుపు, కొద్దిగా గ్లిజరిన్, అలోవెరా జెల్ కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఒకవేళ మీ వద్ద గ్లిజరిన్ లేదా అలోవెరా జెల్ లేకపోతే, వాటికి బదులుగా కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్‌ను ముఖం, మెడకు అప్లై చేసి, ఐదు నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత, అదే ప్యాక్‌తో ఐదు నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేసి, చల్లటి నీటితో ముఖాన్ని పూర్తిగా కడుక్కోండి.

ఫేషియల్ తర్వాత జాగ్రత్తలు:

ముఖం కడుక్కున్న తర్వాత, మీ చర్మ తత్వానికి సరిపోయే మంచి మాయిశ్చరైజర్ లేదా సీరం అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, ఫేషియల్ గ్లోను ఎక్కువ కాలం నిలుపుతుంది. ఒకవేళ మీరు ఈ ఫేషియల్‌ను పగటిపూట చేసుకుంటే, తర్వాత తప్పనిసరిగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి.

ఈ సహజసిద్ధమైన ఫేషియల్‌ను వారానికి ఒకసారి చేసుకోవడం ద్వారా, మీరు ఎలాంటి కెమికల్స్ లేకుండానే కాంతివంతమైన, అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us