Neem Health Benefits in telugu: మన దేశ వైద్య చరిత్రలో వేపకున్న విశిష్టత ప్రత్యేకమైనది. వేప అద్భుతమైన దివ్యౌషధం. వేప చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అంటే ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు, పండ్లు లేదా పూలు ఇవన్నీ ఆయుర్వేద చికిత్సా విధానంలో విరివిగా వాడతారు. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడానికి, చర్మం, నోటి ఆరోగ్యం, జీర్ణక్రియ.. ఆరోగ్యాలను మెరుగుపరచడంలో వేప ఎంతో ఉపయోగపడుతుంది. వేప వేరు, కాండం, ఆకులు, బెల్లం, గింజలు, నూనె వంటివి వివిధ వ్యాధుల నివారణలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఎసిడిటీ , యూరిన్, చర్మ వ్యాధుల నివారణకు ఇంటి పెరట్లో దొరికే వేప చెట్టు చేసే మేలు అంతా ఇంతాకాదు. ఆయుర్వేదం ప్రకారం గర్భిణీ స్త్రీలు, పిల్లలు వేపను తీసుకోకూడదు.