నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కొంతమంది నవరాత్రులలో 9 రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాస సమయంలో చాలా మంది స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫాస్టింగ్ డైట్ గురించి కొంచెం ఆందోళన చెందుతారు. పండ్లను ఉపవాస సమయంలో కూడా తినవచ్చు.. అయితే కొన్ని పండ్లలో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. తక్కువ వ్యవధిలో ఏదైనా తింటూ ఉండాలి. డయాబెటిక్ పేషెంట్ ఉపవాస సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో నిపుణుల ద్వారా తెలుసుకుందాం.
బుక్వీట్ పిండి: ఎవరైనా మధుమేహంతో బాధపడుతున్నట్లు అయితే ఉపవాస సమయంలో బుక్వీట్ పిండితో చేసిన వస్తువులను తీసుకోండి. ఇది గ్లూటెన్ రహిత పిండి. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. నవరాత్రులలో టిక్కీ లేదా రోటీని తయారు చేసి తినవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
వాటర్ చెస్ట్ నట్స్ : నవరాత్రి సమయంలో ఉపవాసం ఉంటే మధుమేహ రోగులు వాటర్ చెస్ట్ నట్స్ పిండిని కూడా ఉపయోగించవచ్చు. ఈ పిండిలో కొన్ని వాల్‌నట్‌లను కూడా కలపవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైన , శక్తివంతమైన పిండి. డయాబెటిస్ బాధితులకు ఈ రెండూ చాలా మేలు చేస్తాయి. వీటితో చేసిన ఆహారం తినడం వలన బలహీనత కలగదు.
రాగి పిండి: శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించడానికి రాగి పిండితో చేసిన వాటిని తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.దీని కారణంగా కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది.
తగినంత నీరు త్రాగాలి
ఉపవాస సమయంలో శరీరంలో హైడ్రేషన్ లో లోటు ఉండకూడదు. వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. శరీరంలో నీరు లేకపోవటం వల్ల నీరసం అనే ఫీలింగ్ మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా నీటిని త్రాగాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..