
ఖరీదైన సబ్బులు వాడాల్సిన అవసరం లేకుండా ముల్తానీ మట్టితో స్నానం చేస్తే చర్మం, జుట్టుకు సహజ మెరుపుతో పాటు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ముల్తానీ మట్టిలో కలబంద జెల్ కలిపి వాడితే మీ జట్టుకు సహజ మెరుపును అందిస్తుంది. అలాగే, ఇది హెయిర్ కండిషనింగ్‌కు సహాయపడుతుంది. చుండ్రును కూడా దూరం చేస్తుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిని ముందుగా జుట్టుకు అప్లై చేయండి. అలాగే, సగం బకెట్ నీటిలో మూడు కప్పుల ముల్తానీ మట్టి పొడి, 2 చెంచాల శనగపిండి, అర చెంచా పసుపు కలిపి స్నానం కోసం ఆ నీటిని వాడండి.
ముల్తానీ మట్టితో స్నానం చేయడం అంటే మీరు మట్టి నీటితో స్నానం చేయాలి. అంటే మొదట మీరు ఆ నీటితో శరీరాన్ని పూర్తిగా తడపండి. ఇప్పుడు మట్టిని కొంతసేపు శరీరానికి పట్టించుకోవాలి. ముల్తానీ మట్టితో ఇలా చేయడం వల్ల చర్మంపై ఉంటే మురికి తొలగించడంతో పాటు రంధ్రాలను తెరుస్తుంది. మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. చర్మంలో సహజ మెరుపును తీసుకువస్తుంది.
ముల్తానీ మట్టి చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది. మీరు వారానికి 2 నుండి 3 రోజులు ముల్తానీ మట్టితో స్నానం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ముల్తానీ మట్టి ప్యాక్ వేసిన తర్వాత గంటల సమయం వేచివుండకూడదు. అలాగే, మట్టితో స్నానం చేసిన కొద్దిసేపటి తర్వాత మళ్లీ శుభ్రమైన నీటితో స్నానం చేయాలి.
మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. మెరిసే చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. చర్మాన్ని రాత్రిపూట హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. నైట్ క్రీమ్ వాడితే చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. రాత్రిపూట విటమిన్ సి సీరం వాడితే చర్మానికి మేకప్ అవసరం లేదు. ప్రతిరోజు రాత్రి మాయిశ్చరైజర్ తో మసాజ్ చేస్తే చర్మం బాగుంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..