
Money Plant Care Tips: వేసవి కాలంలో ఇంటిని చల్లగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా మంది ఇండోర్ మొక్కలను పెంచుతుంటారు. అందులో అందరికీ ఇష్టమైనది. తక్కువ సంరక్షణ అవసరమయ్యేది ‘మనీ ప్లాంట్’. ఇది ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా గాలిని శుభ్రపరుస్తుంది. అయితే, మండుతున్న ఎండల కారణంగా ఈ పచ్చని మొక్క ఒక్కోసారి వాడిపోతుంటుంది. అసలు మనీ ప్లాంట్ ఎందుకు పాడవుతుంది? దానిని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇది కూడా చదవండి: వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట.. సర్వేలో షాకింగ్ నిజాలు..!
1. ఎండ దెబ్బ: మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారి, అంచులు ఎండిపోతున్నాయంటే దానికి కారణం విపరీతమైన ఎండ. ఈ మొక్కలు 20-25 డిగ్రీల ఉష్ణోగ్రతలో, తక్కువ వెలుతురులో బాగా పెరుగుతాయి. నేరుగా ఎండ తగిలితే ఆకులు మాడిపోతాయి.
2. తేమ లేకపోవడం: వేసవిలో కేవలం వేర్లకు నీరు పోస్తే సరిపోదు. గాలిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకుల్లోని తేమ ఆవిరైపోతుంది. దీనివల్ల ఆకులు ముడతలు పడతాయి.
3. వాతావరణ మార్పులు: ఒక్కోసారి వాతావరణం అకస్మాత్తుగా మారడం (అంటే కాసేపు ఎండ, కాసేపు వర్షం) వల్ల మొక్క స్ట్రెస్ (ఒత్తిడి) కి గురవుతుంది. దీనివల్ల ఆకులు నల్లగా మారుతుంటాయి.
4. అతిగా నీరు పోయడం: మొక్క ఎండిపోతుందని అతిగా నీరు పోయడం కూడా ప్రమాదకరమే. కుండీలో నీరు నిలిచిపోతే వేర్లు కుళ్ళిపోయి, ఆకులు రాలిపోతాయి.
నీడలో ఉంచండి: మొక్కను నేరుగా ఎండ తగలకుండా ఇంటి లోపల లేదా బాల్కనీలో నీడ ఉన్న చోట ఉంచండి.
నీటి స్ప్రే (Misting): రోజుకు ఒకటి లేదా రెండు సార్లు స్ప్రే బాటిల్‌తో ఆకులపై నీటిని చిలకరించండి. దీనివల్ల మొక్క తాజాగా ఉంటుంది.
నీరు పోసే పద్ధతి: కుండీలోని మట్టి పైభాగం పూర్తిగా ఎండిపోయినట్లు అనిపిస్తేనే నీరు పోయండి.
సరైన స్థలం: మొక్కను పదే పదే ఒక చోటి నుండి మరో చోటికి మార్చకండి. ఒకే రకమైన వాతావరణం ఉన్న చోట ఉంచితే మొక్క స్థిరంగా పెరుగుతుంది.
మనీ ప్లాంట్ అనేది చాలా తక్కువ శ్రమతో పెరిగే మొక్క. పైన చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఈ వేసవిలో కూడా మీ ఇల్లు పచ్చదనంతో కళకళలాడుతుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి