Mint Water
Mint Water Benefits in telugu: పుదీనాలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో తలెత్తే తాపాన్ని నివారించడానికి ఎన్నో ఆహారాలు తీసుకుంటాం. ఇప్పట్నుంచి వాటిల్లో పుదీనా కూడా చేర్చాలి. ఎందుకంటే.. పుదీనాలో చల్లదనాన్ని ప్రేరేపించే లక్షణం ఉంటుంది. చట్నీ, రసం, కూర, టీ ఏ విధంగా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనా ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. పుదీనా ఆకుల్లో మెంథాల్ ఉంటుంది. అందువల్ల దీనితో తయారు చేసిన నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పుదీనా నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
- పుదీనా ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్, ఫైటోన్యూట్రియెంట్స్ గుణాలు జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అజీర్ణ సమస్యలు తొలగిపోయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
- పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దంతాలు, చిగుళ్ళ సమస్యతో బాధపడేవారికి మంచి వైద్యంలా ఉపయోగపడుతుంది. పుదీనా నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన, బాక్టీరియాను తొలగించడంలో ఈ నీరు ఎంతో ప్రయోజనకారి. ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.
- అలర్జీ, ఆస్తమాతో బాధపడేవారికి పుదీనా నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది.
- పుదీనా నీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను కూడా పటిష్ట పరుస్తుంది.
ముఖ్యంగా వేసవిలో చాలా మంది ఎండలో తిరగడం వల్ల తలనొప్పితో బాధపడుతుంటారు. పుదీనా ఆకుల్లోని మెంథాల్ కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.