AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖరీదైన ఏసీ, కూలర్స్‌ వద్దు.. ఇదొక్కటి మీ ఇంట్లో ఉంటే సమ్మర్‌ మొత్తం చల్లగా పడుకోవచ్చు!

Budget-Friendly Summer Sleep Tips: ఎండాకాలం వచ్చిందంటే చాలూ నిద్రపోవడానికి నరకం చూడాల్సిందే.. ఉదయ మంతా ఎండ వేడి, రాత్రంతంతా ఉక్కపోతా.. కంటి నిండా నిద్రపోవడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బులున్న వారైతే వేలు వేలు పెట్టి కూలర్స్, ఏసీలు కొంటారు. మరి సామన్యుల పరిస్థితి ఏంటి.. అలాంటి వారి కోసమే ఓ సరికొత్త ప్రాడక్ట్ గురించి చెప్పబోతున్నాం. ఇదొక్కటి మీ ఇంట్లో ఉంటే సమ్మర్ మొత్తం హ్యాపీగా నిద్రపోవచ్చు.

ఖరీదైన ఏసీ, కూలర్స్‌ వద్దు.. ఇదొక్కటి మీ ఇంట్లో ఉంటే సమ్మర్‌ మొత్తం చల్లగా పడుకోవచ్చు!
Summer Cooling
Anand T
|

Updated on: Apr 18, 2026 | 7:10 PM

Share

సమ్మర్ వచ్చిందంటే చాలూ ఉక్కపోత వల్ల సరిగ్గా నిద్రపట్టక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఫ్యాన్ వేసినా కేవలం వేడి గాలే వస్తోందని చాలా మంది వాపోతున్నారు. ఏప్రిల్ సగం కూడా గడవకముందే ఎండలు ఈ స్థాయిలో ఉంటే, మే నెలలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొంది, హాయిగా నిద్రపోవాలంటే ఎయిర్ కూలర్, లేదా ఏసీ ఉండాల్సిందే. కానీ వాటి ధరలేమో వేలల్లో ఉంటాయి. పైగా సమ్మర్ అయిపోయాక వాటితో పెద్ద పనే ఉండదు పక్కన పడేయాల్సిందే. ఈ క్రమంలోనే తక్కువ ధరకు వాటికి ప్రత్యామ్నాయంగా ఉండే మినీ కూలర్స్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

మీ బడ్జెట్ తక్కువగా ఉండి, ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నట్లయితే ఈ మినీ కూలర్లు మీకు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. మీటికి మీరు వేలల్లో డబ్బు పెట్టాల్సిన పనిలేదు. మీషో , అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఇవి కేవలం రూ. 400 నుండి రూ. 1000 లోపు ధరల్లోనే దొరుకుతాయి. లేదంటే బయట స్టోర్స్‌లో కు వెళ్లి కూడా తెచ్చుకోవచ్చు. ఇందులో కూడా కూలర్‌లో ఉంటే అన్న ఫీచర్స్ ఉంటాయి. మీకు నచ్చిన విధంగా గాలి వచ్చే దిశను దీన్ని మార్చుకోవచ్చు. మీకు మంచి సువాసన కావాలనుకుంటే ఇందులో కొద్దిగా పర్ఫ్యూమ్ వేస్తే చాలూ చల్లని గాలితో పాటు సువాసన కూడా రూమ్ మొత్తం వ్యాపిస్తుంది.

ఇవి సైజ్‌లో కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి వేల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద కూలర్లు కొనలేము అనుకునే వారు, జస్ట్ రూ. 600-700 పెట్టి ఈ మినీ కూలర్ తెచ్చుకుంటే సమ్మర్ మొత్తం హాయిగా నిద్రపోవచ్చు. ఉక్కపోతతో సతమతమయ్యే బదులు ఇలాంటి స్మార్ట్ గాడ్జెట్లను ఉపయోగించడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us