అబ్బాయిలూ జర జాగ్రత్త.. ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టరట..! ఇంకా ఆ విషయంలో..

|

Oct 21, 2024 | 5:26 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలాముఖ్యం.. అంతేకాకుండా.. సరైన సమయంలో పెళ్లి చెసుకోవడం కూడా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.. తక్కువ స్పెర్మ్ కౌంట్ కారణంగా గర్భం దాల్చడం చాలా కష్టమవుతుంది. అందుకే.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అబ్బాయిలూ జర జాగ్రత్త.. ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టరట..! ఇంకా ఆ విషయంలో..
Relationship Tips
Follow us on

ఆధునిక కాలంలో చాలామంది సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు.. దీనికి ముఖ్యకారణం స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం.. ఇతర అనారోగ్య సమస్యలు.. వీర్యకణాలు తగ్గిపోవడానికి చాలా కారణాలున్నాయి.. ముఖ్యంగా ఆలస్యంగా వివాహం, ఒత్తిడి, అనారోగ్య జీవనశైలి కారణంగా స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుంది. అయితే.. ప్రస్తుత కాలంలో పురుషుల సంతానోత్పత్తి అనేది తీవ్రమైన ఆందోళన కలిగించే అంశంగా మారింది. గర్భం దాల్చడానికి.. స్పెర్మ్ కౌంట్ ప్రతి మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ కంటే ఎక్కువగా ఉండాలి. దీని కంటే తక్కువగా ఉంటే, అది తక్కువ స్పెర్మ్ కౌంట్‌గా పరిగణిస్తారు.

అటువంటి పరిస్థితిలో.. మీరు లైంగిక సమస్యలు, సామర్థ్యం తగ్గిపోవడం, వృషణ సంబంధిత సమస్యలు, శరీరం – ముఖం – జుట్టు పెరుగుదలలో మార్పులను ఎదుర్కొంటుంటే, అది మీ వీర్యంలో తక్కువ స్పెర్మ్ కౌంట్ సంకేతం కావచ్చు. ఈ కారణాల వల్ల సంతానలేమి సమస్యతోపాటు.. ఇతర సమస్యలు సాధారణంగా జరుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. పురుషుల్లో ప్రతిరోజూ ఇలాంటి సమస్యలే పునరావృతం అవుతుంటే.. అలర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు స్పెర్మ్ కౌంట్ తగ్గేలా చేస్తాయి..అంతేకాకుండా సంతానలేమి సమస్యకు కారణమవుతాయి.. తక్కువ స్పెర్మ్ కౌంట్ కారణంగా గర్భం దాల్చడం చాలా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో తండ్రి కావాలనుకునే వ్యక్తులు ఈ 5 అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి..

ఈ అలవాట్లకు దూరంగా ఉండండి..

ధూమపానం: సిగరెట్ తాగడం చాలామంది పురుషుల్లో సర్వసాధారణంగా మారింది.. యువత ధూమపానానికి బానిసగా మారుతోది.. అయితే, ధూమపానం ఊపిరితిత్తులకే కాదు.. లైంగిక ఆరోగ్యానికి కూడా హానికరం. ధూమపానం చేసే పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందని.. దాని కదలిక కూడా ప్రభావితమవుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి..

మద్యం తాగడం: నేటి కాలంలో అబ్బాయిలు చిన్నప్పటి నుండే మద్యం తాగడం మొదలుపెడుతున్నారు.. ఇది మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఆల్కహాల్ తాగే పురుషుల సంతానోత్పత్తిపై ఇది ప్రభావం చూపుతుంది. దీని కారణంగా తగినంత వీర్యకణాలు ఉత్పత్తి కావు.. అంతేకాకుండా ఉత్పత్తి తగ్గడంతోపాటు.. చలనశీలత కూడా బాగా తగ్గుతుందని పేర్కొంటున్నారు.

టెన్షన్ (ఒత్తిడి): అధిక ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిని పెంచుతుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. అందువల్ల, యోగా, ధ్యానం, శారీరక వ్యాయామం వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యం.

అనారోగ్యకరమైన ఆహారాలు: ఆహారం కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఫాస్ట్ ఫుడ్, చక్కెర, కొవ్వు పదార్ధాలను తీసుకోవడం వల్ల శరీరంలో వాపు, బరువు పెరుగుట, ఇది స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. విటమిన్లు, ఖనిజాల లోపాలు, ముఖ్యంగా జింక్, సెలీనియం, ఫోలిక్ యాసిడ్, స్పెర్మ్ నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

తీవ్రమైన వేడిలో నివసించడం: పురుషులకు, దిగువ శరీరంలోని అధిక వేడి స్పెర్మ్ కౌంట్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, వేడి స్నానం, బిగుతుగా ఉండే లోదుస్తులు, ల్యాప్‌టాప్‌ను మీ ఒడిలో ఎక్కువ సేపు ఉంచుకుని పనిచేయడం మానుకోవాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.. లేదంటే వృషణాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల స్పెర్మ్ పాడైపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..