ఫ్యామిలీ లైఫ్‌ సాఫీగా సాగాలంటే? సుధామూర్తి చెప్పిన 5 సూత్రాలు

భార్యాభర్తల బంధం అనేది ఒక అందమైన ప్రయాణం. వేర్వేరు ఆలోచనలు, అలవాట్లు ఉన్న ఇద్దరు వ్యక్తులు కాలక్రమేణా ఒకరికోసం మరొకరు అన్నట్లుగా కలిసిపోవడమే ఈ బంధం విశిష్టత. కేవలం ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాకుండా, రెండు మనసులు ఒకే ప్రాణంగా మమేకమై ముందుకు సాగడమే అసలైన సంసారం.

ఫ్యామిలీ లైఫ్‌ సాఫీగా సాగాలంటే? సుధామూర్తి చెప్పిన 5 సూత్రాలు
Sudha Murthy1

Updated on: May 07, 2026 | 6:25 AM

ప్రతి రిలేషన్‌షిప్‌లోనూ మనసువిప్పి మాట్లాడుకోవడం, ఎదుటివారి భావాలను గౌరవించడం ప్రధానమని రీసెర్చ్ గేట్ అధ్యయనం చెబుతోంది. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ సుధామూర్తి దాంపత్య బంధాన్ని మరింత దృఢంగా మార్చే 5 కీలక అంశాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు.

  • దాంపత్యంలో పెద్ద పెద్ద బహుమతుల కంటే ఒకరిపై ఒకరికి ఉండే చిన్న చిన్న జాగ్రత్తలే ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఇచ్చే ధైర్యం కొండంత అండగా నిలుస్తుంది. ఒకరి లక్ష్యాలకు మరొకరు తోడ్పడుతూ, ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవాలి. లోపాలను ఎత్తిచూపకుండా ఒకరినొకరు సరిదిద్దుకోవడమే అసలైన కేరింగ్.
  • వింతగా అనిపించినా, భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు బంధాన్ని బలోపేతం చేస్తాయి. మనసులో అసంతృప్తిని దాచుకోకుండా బయటకు చెప్పడం వల్ల మనసు తేలికపడుతుంది. తప్పులు సరిదిద్దుకోవడానికి ఇవి పాఠాల్లా పనిచేస్తాయి. అయితే ఈ పోట్లాటల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం, పాత విషయాలు తీయడం వంటివి చేయకూడదని గుర్తుంచుకోవాలి.
  • ఒకరు కోపంతో ఊగిపోతున్నప్పుడు మరొకరు కూడా అదే స్థాయిలో స్పందిస్తే అది సంసారాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఒకరు ఆగ్రహంతో ఉన్నప్పుడు మరొకరు మౌనంగా, శాంతంగా ఉండటం ఉత్తమం. దీనివల్ల అవతలి వ్యక్తి కోపం త్వరగా తగ్గుతుంది.
  • ప్రతి చిన్న విషయానికి పట్టు పట్టడం వల్ల జీవితంలో ప్రశాంతత కరువవుతుంది. ఇష్టాయిష్టాల విషయంలో ఇద్దరి వైపు నుండి పట్టు విడుపులు ఉండాలి. ఒకరి గౌరవాన్ని మరొకరు కాపాడుకుంటూ ముందుకు సాగడం ఒక గొప్ప కళ.
  • బాధ్యతలు పంచుకోవడం అంటే కేవలం పని భారాన్ని తగ్గించుకోవడం కాదు, అది ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చాటుకోవడం. సంపాదన భర్తది, వంట భార్యది అనే గీతలు గీసుకోకుండా అన్ని విషయాలను షేర్ చేసుకోవాలి. ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తిస్తూ పనుల్లో భాగస్వామ్యం అయినప్పుడే ఆ ఇల్లు స్వర్గమవుతుంది.
Loading...
Unable to load recommendations.
Follow Us