Lemon Tea Benefits: ప్రతి ఉదయం కప్పు లెమన్‌ టీ తాగారంటే మోకాళ్ల నొప్పులు పరార్‌..

|

Mar 24, 2023 | 4:21 PM

శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా ఉంటేనే పనులు చేసుకోవడానికి తెగ ఇబ్బందిపడిపోతుంటాం. ఇక కీళ్లు వాచి, భరించలేనంత నొప్పి వస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దీనిని కీళ్ల వాతం (ఆర్థరైటిస్) అంటానే. ఈ సమస్య ఉన్నవారికి..

Lemon Tea Benefits: ప్రతి ఉదయం కప్పు లెమన్‌ టీ తాగారంటే మోకాళ్ల నొప్పులు పరార్‌..
Lemon Tea Benefits
Follow us on

శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా ఉంటేనే పనులు చేసుకోవడానికి తెగ ఇబ్బందిపడిపోతుంటాం. ఇక కీళ్లు వాచి, భరించలేనంత నొప్పి వస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దీనిని కీళ్ల వాతం (ఆర్థరైటిస్) అంటానే. ఈ సమస్య ఉన్నవారికి లెమన్‌గ్రాస్ టీ ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల మోకాళ్లలో వాపు, నొప్పులు తగ్గుముఖం పడుతాయి. లెమన్‌ టీలో విటమిన్ సీ అధికంగా ఉండటం వల్ల శరీరం కాల్షియం గ్రహించడంలో సహాయపడుతుంది. ఫలితంగా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అందుకే ప్రతి రోజూ ఉదయాన్నే లెమన్ టీ తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు

లెమన్ టీ ప్రయోజనాలు..

  • లెమన్ టీలోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఆర్థరైటిస్‌లో నొప్పి, వాపుకు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కారణమవుతుంది.
  • కీళ్ల నొప్పులను తగ్గించడంలో లెమన్ టీ సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు మన శరీరంలోని హానికర టాక్సిన్లను తొలగిస్తుంది. ఆరోగ్యకరమైన కణాల వృద్ధికి తోడ్పడి, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు లెమన్ టీ తాగితే అనతికాలంలోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
  • లెమన్ టీ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. లివర్‌ పనితీరును ప్రేరేపిస్తుంది. లెమన్‌ టీ ప్రతి ఉదయం తాగితే శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ తగ్గడంతో పాటు ఆర్థరైటిస్ సమస్య రాకుండా నివారిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తా కథనాల కోసం క్లిక్‌ చేయండి.