
ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ రాత్రిళ్లు క్రమం తప్పకుండా ఎక్కువసేపు నిద్రపోవాలి. ఈ అలవాటు వారి ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఎవరైనా అప్పుడప్పుడు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతే పర్వాలేదుగానీ.. తరచూ ఇలా చేస్తే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎవరైనా దానిని అలవాటుగా చేసుకుంటేనే అసలు సమస్య మొదలవుతుంది. ఇది క్రమంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనినుంచి బయటపడాలంటే నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతి రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం మన ఆరోగ్యానికి చాలా హానికరమని ఆయుర్వేద నిపుణులు అన్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతినడమే కాకుండా, జీర్ణక్రియపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఎవరైనా రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతే, వారి శరీర గడియారం చెదిరిపోతుంది. అంతేకాకుండా ఉదయం నిద్ర లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుంది. సోమరితనం వస్తుంది. అంతేకాకుండా, ఆలస్యంగా నిద్రపోవడం మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా ఆందోళన పెరగవచ్చు. ఎందుకంటే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు సరైన సమయంలో విశ్రాంతి తీసుకోదు. దీని ఫలితంగా మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటివి జరుగుతాయి.
అంతే కాదు, క్రమం తప్పకుండా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. రాత్రంగా బాగా నిద్రపోతే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతే, అది జీవక్రియ, బరువును ప్రభావితం చేస్తుంది. దీంతో రోజురోజుకూ మరింత లావుగా తయారవుతారు. ఇది మీరు గమనిస్తే మీ నిద్ర గురించిన తగిన జాగ్రత్త తీసుకోవల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించాలి.
నిపుణుడు అభిప్రాయం ప్రకారం, రాత్రి ఆలస్యంగా పడుకుని చాలా ఆలస్యంగా మేల్కొనే వారికి రోజంతా సక్రమంగా ఉండదు. ఆలస్యంగా మేల్కొనే వారు వారి చదువులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం ఏం చేయడానికి శక్తి చాలదు. ఈ పరిస్థితిలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా 7-8 గంటల పూర్తి నిద్ర అవసరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.