
ఇంట్లో తయారు చేసుకునే ప్రతి పదార్థం అందరి చర్మానికీ ఒకేలా సరిపోదు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. మరి కొరియన్ స్టైల్‌లో ఈ DIY స్కిన్‌కేర్ పద్ధతులను ఎలా చేసుకోవాలి? తెలుసుకుందాం.
1. బియ్యంతో ఫేస్ మాస్క్
అర కప్పు బియ్యానికి ఒక కప్పు నీరు, ఒక టేబుల్‌స్పూన్ తేనె కలిపి మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. బియ్యం ఆధారిత పదార్థాలు చర్మానికి తేమను అందించడంలో, చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
2. రైస్ వాటర్‌ను టోనర్‌గా
అర కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి ముఖానికి టోనర్‌లా ఉపయోగించవచ్చు. మరో పద్ధతిలో బియ్యాన్ని నీటిలో ఉడికించి మిగిలిన నీటిని చల్లార్చి ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.
3. దోసకాయ–అలోవెరా మాస్క్
అర దోసకాయను మెత్తగా గ్రైండ్ చేసి అందులో 2–3 టేబుల్‌స్పూన్ల అలోవెరా జెల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15–20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవచ్చు. దోసకాయ చర్మానికి చల్లదనాన్ని అందించగా, అలోవెరా తేమను అందించడంలో సహాయపడుతుంది.
4. బియ్యం ఆధారిత స్కిన్‌కేర్‌కు కారణం ఇదే
బియ్యంలో యాంటీఆక్సిడెంట్లు, ఫెరులిక్ యాసిడ్, గామా-ఒరిజనాల్, కొన్ని విటమిన్లు, చర్మానికి తేమను అందించే సమ్మేళనాలు ఉంటాయి. రైస్ ఆధారిత పదార్థాలు చర్మ తేమ, చర్మ రక్షణ పొరను మెరుగుపరచడంలో సహాయపడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
5. గ్లాస్ స్కిన్ కోసం జాగ్రత్తలు కూడా ముఖ్యం
ఈ DIY పద్ధతులను ఉపయోగించడం వల్ల ఒక్కసారిగా కొరియన్ గ్లాస్ స్కిన్ వస్తుందని భావించకూడదు. చర్మ సంరక్షణలో మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్, సరైన క్లెన్సింగ్ వంటి ప్రాథమిక అలవాట్లు కూడా ముఖ్యమే. కొత్తగా ఏదైనా DIY పదార్థాన్ని ముఖానికి రాసుకునే ముందు చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి ఖరీదైన ఉత్పత్తులు మాత్రమే గ్లోయింగ్ స్కిన్‌కు మార్గం అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంట్లో చేసే DIY చిట్కాలను కూడా జాగ్రత్తగా, పరిమితంగా ఉపయోగించాలి. చర్మంపై దురద, మంట, ఎర్రదనం లేదా అలర్జీ కనిపిస్తే వెంటనే ఉపయోగించడం ఆపేయాలి.