Chicken freshness tips: మాంసం ప్రియులు చికెన్‌ను ఎంతో ఇష్టంతో తింటారు. చికెన్ బిర్యానీ నుంచి కర్రీల వరకు ఎన్నో రకాల వంటకాలను ఆరగిస్తుంటారు. మీరు కూడా చికెన్ ప్రేమికులైతే.. చికెన్ కొనేటప్పుడు పలు విషయాలను తెలుసుకోవడం చాలామంచిదని నిపుణులు పేర్కొంటన్నారు. దుకాణాల్లో మాంసాన్ని విక్రయిస్తున్నప్పుడు పలు మోసాలు జరిగే అవకాశం ఉంది. దీంతో చికెన్ ప్రియులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అందుకే చికెన్ కొనే ముందు పలు విషయాలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా మనం చికెన్ కొనడానికి సూపర్ మార్కెట్లు, లేదా చికెన్ సెంటర్లపై ఆధారపడతాం. ఇది మంచి ఎంపిక అయినప్పటికీ సూపర్ మార్కెట్‌లలోని చికెన్‌లో ఎక్కువ భాగం ప్రాసెస్ చేయబడి లేదా ప్యాక్ చేసి ఉంటుంది. చికెన్ సెంటర్లలో కూడా ఎప్పుడో మిగిలిపోయిన చికెన్ ఇస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్న చికెన్ తాజాగా ఉందా..? లేదా..? అని నిర్ధారించుకోవడం సవాలుగా ఉంటుంది. కొన్న చికెన్ మంచి నాణ్యతతో ఉందో లేదో తెలుసుకోవడానికి లేదా తనిఖీ చేయడానికి ఐదు చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు డైటిస్టులు. దీంతో చికెన్ కొనుగోలు చేసినప్పుడు లేదా వండేటప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకోండి..
చికెన్ చెడిపోయిందో లేదో తెలుసుకోవడానికి చిట్కాలు
రంగులో మార్పును గమనించండి..
చికెన్ చెడిపోయిందో లేదో తెలుసుకోవడానికి రంగులో మార్పు అనేది సులభమైన మార్గాలలో ఒకటి. తాజాగా కత్తిరించిన చికెన్ ముక్కలు గులాబీ రంగును కలిగి ఉంటాయి. అయితే నిస్తేజమైన బూడిద, పసుపు రంగు లేదా లేత రంగు అది ఉత్తమ నాణ్యత కాదని పేర్కొంటున్నారు. అలా ఉంటే కొనద్దని సూచిస్తున్నారు.
చికెన్‌ను ముట్టుకొని చూస్తే అర్ధమవుతుంది..
దుకాణంలో కొనుగోలు చేసిన చికెన్ ఎక్కువగా ప్యాక్ చేయబడి లేదా ఫ్రిజ్‌లో ఉంచినదై ఉంటుంది. అయితే దీన్ని కొనే ముందు లేదా వండే ముందు టచ్ చేసి చూడండి. ఇంకా కడగడం ఉత్తమ మార్గం. చికెన్ సహజంగా నిగనిగలాడుతూ.. లేదా కొంత మెత్తదనాన్ని కలిగి ఉంటుంది. అయితే.. కడిగిన తర్వాత అసాధారణంగా జిగట, మెత్తగా అనిపిస్తే చికెన్ చెడిపోయిందని భావించడం మంచిది.
చికెన్ వాసన..
తాజా పచ్చి చికెన్ చాలా తేలికపాటి వాసనను కలిగి ఉంటుంది.. లేదా అస్సలు వాసన ఉండదు. చెడిపోయిన చికెన్ బాగా వాసన కలిగి ఉంటుంది. చికెన్‌లో పుల్లని లేదా సల్ఫర్ లాంటి వాసన ఉంటే కుళ్ళిన గుడ్లు లాగా ఉంటే, దాన్ని పడేయడం మంచిది. చికెన్‌లో వ్యాధికారక క్రిములు అభివృద్ధి చెందడం వల్ల ఈ దుర్వాసన వస్తుంది.
ఐస్ క్రస్ట్ చూడండి..
ఫ్రిజర్‌లో ఉంచిన చికెన్ కొనుగోలు చేసిన దుకాణం చుట్టూ మంచుతో నిండిన క్రస్ట్‌ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఫ్రీజర్‌లో తేమ కోల్పోవడం వల్ల ఇది సాధారణంగా జరుగుతుంది. ఇది చికెన్ నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అయితే చికెన్ చుట్టూ అసాధారణంగా మందపాటి మంచు పొర ఉంటే అది అస్సలు మంచిది కాదు.
మచ్చలు చూడండి..
చికెన్ కొనేటప్పుడు లేదా వండేటప్పుడు గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే మచ్చలు చూడటం.. రంగు మచ్చలు ఉన్నాయేమో పరిశీలించాలి. పచ్చి చికెన్ కాలక్రమేణా దాని రంగును మార్చుకోవడం సాధారణమైనప్పటికీ – తెలుపు, ఎరుపు, పసుపు లేదా ఏదైనా రకమైన ముదురు మచ్చలు ఉంటే.. చికెన్ చెడిపోవడాన్ని సూచిస్తాయి. ఇది వినియోగానికి సురక్షితం కాదు..
కావు.. మీరు తదుపరిసారి చికెన్‌ని కొనుగోలు చేసినప్పుడు లేదా వండేటప్పుడు ఈ చిట్కాలను గుర్తుంచుకోండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..