Health Tips: తొక్కే కదా అని తీసిపారేయకండి.. అందులోనే ఉంది అసలు మ్యాటర్..! ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..

దీంతో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. అనవసరంగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కివి తొక్క శరీరంలో ఇన్సులిన్‌ను కూడా సమతుల్యం చేస్తుంది. కడుపు ఉబ్బరం, వాపు కూడా తగ్గుతుంది. కివీ పండు తొక్కలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా పనిచేస్తుంది.

Health Tips: తొక్కే కదా అని తీసిపారేయకండి.. అందులోనే ఉంది అసలు మ్యాటర్..! ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..
Kiwi Peels

Updated on: May 27, 2025 | 1:28 PM

కివీ ఫ్రూట్స్‌.. వీటినే చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా అంటారు..ఈ పండు పోషకాల గని.. కివీలో విటమిన్లు A, E, C, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్, విటమిన్ బి6 సమృద్ధిగా నిండివున్నాయి. ఇది శరీరంలో కణజాల పెరుగుదల, మరమ్మత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కివీలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఈ అద్భుతమైన పండు ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కేవలం పండు మాత్రమే కాదు..కివీ తొక్కలు కూడా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కివి తొక్కలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొవ్వును కరిగించడానికి పనిచేస్తుంది. దీంతో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. అనవసరంగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కివి తొక్క శరీరంలో ఇన్సులిన్‌ను కూడా సమతుల్యం చేస్తుంది. కడుపు ఉబ్బరం, వాపు కూడా తగ్గుతుంది. కివీ పండు తొక్కలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా పనిచేస్తుంది.

అయితే, కివి తొక్కను ఉపయోగించే ముందు పండును శుభ్రంగా కడగాలని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత దాన్ని జ్యూస్‌లా చేసుకుని తీసుకోవచ్చునని అంటున్నారు. లేదంటే తొక్కను ఎండబెట్టి మెత్తగా చేసుకుని కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..