కారు ఓనర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఒక్క రూ.1తో లక్షలు మిగిలించుకోండి!

కారులో ఎలుకల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఒక రూపాయి పొగాకు, నెయ్యి, పిండితో తయారుచేసిన సులభమైన, చౌకైన పరిష్కారం ఉంది. ఈ మిశ్రమాన్ని చిన్న బంతులుగా చేసి కారులో ఎలుకలు ఎక్కువగా తిరుగు ప్రదేశాల్లో ఉంచండి. పొగాకు వాసన ఎలుకలను దూరం చేస్తుంది.

కారు ఓనర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఒక్క రూ.1తో లక్షలు మిగిలించుకోండి!
Mice In Car Engine

Updated on: Sep 26, 2025 | 12:32 PM

ఎలుకల బెడద గురించి తెలిసిందే. ఇంటి కన్నాల్లోనే కాదు.. కార్లలో కూడా చేరి వాటి నోటికి పనిచెబుతుంటాయి. చాలా మంది కార్ల యజమానులకు ఎలుకలు ఒక పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా పట్టణాల్లోని కార్ల యజమానులకు ఎలుకలతో చాలా ఇబ్బంది ఉంటుంది. తరచుగా పార్క్ చేసిన కార్లలో చేరి ఓనర్లకు వేలు, లక్షల నష్టం కలిగిస్తాయి. ఎలుకలు కారు ఎలక్ట్రికల్ వైరింగ్, ఖరీదైన సెన్సార్లు, ఇంజెక్టర్ వైర్లు, డాష్‌బోర్డ్‌లు, AC ప్యానెల్‌లను కొరికేస్తాయి. అయితే ఈ సమస్యను సులభంగా పరిష్కరించగల ఒక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వెచ్చదనం, రక్షణ కోసం ఎలుకలు కారు ఇంజిన్ లేదా లోపలి భాగంలోకి వెళ్లి దాక్కుంటాయి. అవి నిరంతరం పెరుగుతున్న దంతాలను అరిగిపోవడానికి ప్లాస్టిక్, రబ్బరు, వైర్లను కొరుకుతుంటాయి. దీని వల్ల కారు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మరమ్మతు ఖర్చులు కొన్నిసార్లు వేల నుండి లక్షల రూపాయల వరకు ఉంటాయి. ఎలుకల బెడద వదిలించుకోవడానికి ప్రజలు తరచుగా పురుగుమందులు, ఎలుకల ఉచ్చులను ఉపయోగిస్తుంటారు. అయితే ప్రతిసారి అవి పనిచేయకపోవచ్చు. కానీ, ఒక రుపాయి పద్దతితో మెరుగైన ఫలితం ఉంటుంది.

ఏంటీ 1 రూపాయి పద్ధతి?

ఈ నివారణ చాలా సాధారణమైన, చౌకైన పదార్థాలతో ఉంటుంది. ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే ఇది ఎలుకలను చంపదు, వాటిని కారు నుండి దూరంగా తరిమివేస్తుంది.

కావాల్సిన పదార్థాలు..

  • 1 రూపాయి పొగాకు ప్యాకెట్
  • 2 టీస్పూన్లు స్వచ్ఛమైన దేశీ నెయ్యి
  • శనగపిండి లేదా గోధుమ పిండి
  • అవసరమైనంత నీరు

తయారీ విధానం:

ఒక గిన్నెలో పొగాకు, శనగపిండి (లేదా పిండి) వేసి బాగా కలపండి. ఇప్పుడు దానికి రెండు చెంచాల దేశీ నెయ్యి కలపండి. మెత్తని పిండిని పిసికి కలుపుతూ కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ కలపండి. పిండి తయారైన తర్వాత, దానితో చిన్న బంతులను తయారు చేయండి.

ఎలా ఉపయోగించాలి?

ఈ చిన్న బంతులను కారు ఇంజిన్ చుట్టూ లేదా ఎలుకలు తరచుగా వచ్చే ప్రదేశాలలో ఉంచండి. ఎలుకలు ఈ బంతులను తినడానికి ప్రయత్నిస్తాయి, కానీ పొగాకు బలమైన వాసన, రుచి భరించలేనిదిగా ఉంటుంది. ఎలుకలకు ఈ పొగాకు వాసన అంటే తీవ్రమైన అయిష్టత ఉంటుంది. దీంతో ఎలుకలు ఆ ప్రాంతం, కారు నుండి పారిపోతాయి, తిరిగి రావడానికి ధైర్యం చేయవు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి