Weight Loss Tips: జీలకర్రతో ఆ పదార్థాలను కలిపి తీసుకుంటే అధిక బరువు ఇట్టే తగ్గొచ్చు.. అవేంటంటే..?

|

Aug 05, 2022 | 3:01 PM

జీలకర్రలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు మంచి మొత్తంలో లభిస్తాయి. ఇది కాకుండా జీలకర్ర ఫైబర్, పొటాషియానికి మంచి మూలం.

Weight Loss Tips: జీలకర్రతో ఆ పదార్థాలను కలిపి తీసుకుంటే అధిక బరువు ఇట్టే తగ్గొచ్చు.. అవేంటంటే..?
Weight Loss
Follow us on

Jeera Water For Weight Loss: వంటింట్లో ఉండే జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీలకర్రలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు మంచి మొత్తంలో లభిస్తాయి. ఇది కాకుండా జీలకర్ర ఫైబర్, పొటాషియానికి మంచి మూలం. అంతే కాదు జీలకర్ర తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా బలపడుతుంది. మరోవైపు బరువును తగ్గించుకోవాలనుకున్నా కూడా జీలకర్ర మీకు సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో బరువు తగ్గడానికి జీలకర్రను ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

బరువు తగ్గడానికి జీలకర్రను వీటితో కలిపి తీసుకోండి..

జీలకర్ర – కరివేపాకు నీరు: జీలకర్ర, కరివేపాకు నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీని కోసం రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో జీలకర్ర, కరివేపాకులను నానా బెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే వడపోసి తాగాలి. రోజూ ఈ డ్రింక్ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. అలాగే ఇది బరువును తగ్గించుకోవడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

జీలకర్ర – కొత్తిమీర నీరు: జీలకర్ర, కొత్తిమీర రెండూ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే రాత్రిపూట నీటిలో జీలకర్ర, కొత్తిమీర వేసి ఉంచండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం ఆకలిగా అనిపించదు. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది.

జీలకర్ర – నిమ్మకాయ నీరు: జీలకర్ర వలే నిమ్మకాయ కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి 2 టీస్పూన్ల జీలకర్రను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఈ నీటిని ఉదయం బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి నిమ్మరసం కలిపి తాగాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ జీలకర్ర నీటిని తాగడం ద్వారా బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి