Jaggery Vs Sugar: బెల్లం, చక్కెర.. ఈ రెండింటిలో ఏది పిల్లలకు మంచిదో తెలుసా?

శీతాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఏది మంచిది? అనే విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు బెల్లం లేదా చక్కెర ఈ రెండింటిలో ఏది ఇవ్వాలి అనే విషయంలో పలు సందేహాలు లేవనెత్తుతుంటారు..

Jaggery Vs Sugar: బెల్లం, చక్కెర.. ఈ రెండింటిలో ఏది పిల్లలకు మంచిదో తెలుసా?
Is Jaggery Better Than Sugar For Children

Updated on: Nov 26, 2025 | 4:19 PM

శీతాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఏది మంచిది? అనే విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు బెల్లం లేదా చక్కెర ఈ రెండింటిలో ఏది ఇవ్వాలి అనే విషయంలో పలు సందేహాలు లేవనెత్తుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులు ఈ విషయంలో సరైన అవాగాహన లేకపోవడం వల్ల పిల్లలకు అధిక చక్కెర కలిగిన ఆహారాలు ఇస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి చిన్న పిల్లలకు బెల్లం లేదా చక్కెర ఈ రెండింటిలో ఏది మంచిది? ఎన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు తీపి ఆహారాలు తినడానికి అనుమతించాలి. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బెల్లం, చక్కెర వంటి తీపి పదార్ధాలు ఇవ్వకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత, అంటే రెండు సంవత్సరాల వయస్సు తర్వాత పిల్లలకు బెల్లం ఇవ్వవచ్చు. కానీ దాని పరిమాణం చాలా తక్కువగా ఉండాలి. చక్కెరతో పోలిస్తే బెల్లం పిల్లలకు ఇవ్వడం ఆరోగ్యానికి మంచిదే. కానీ దానిని తక్కువ పరిమాణంలో మాత్రమే ఇవ్వాలి. బెల్లంలో ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన అన్నారు.

బెల్లం తినడం వల్ల కలిగే ప్రభావాలు ఇవే..

బెల్లం రుచికి చాలా తియ్యగా ఉంటుంది. ఇది పిల్లలకు అకస్మాత్తుగా శక్తిని ఇస్తుంది. కానీ తరువాత వారు అలసిపోయినట్లు, నీరసంగా మారుతారు. బెల్లం చక్కెర మాదిరిగానే అధిక తీపి కలిగిన పదార్థం. కాబట్టి పిల్లలు పళ్ళు తోముకోకుండా బెల్లం తినకూడదు. అలాగే బెల్లంతో తయారు చేసిన స్వీట్లను కూడా వారికి ఇవ్వకూడదు. ఇది వారి దంతాలపై ప్రభావం చూపుతుంది. దంత క్షయం ప్రమాదాన్ని పెంచుతుంది. బెల్లం ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, కడుపు నొప్పికి కూడా కారణమవుతుంది. పిల్లలు ఎక్కువగా బెల్లం తీసుకుంటే, అది కాలక్రమేణా వారి ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది. వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.