Itchy Eyes: కంటి దురద ఈ వ్యాధికి ప్రారంభ సంకేతం.. బీ కేర్ ఫుల్‌ బ్రదర్‌!

వేసవి, శీతాకాలంలో పొడి గాలితోపాటు దైనందిన జీవనశైలి అలవాట్లు కంటి అసౌకర్యానికి కారణంగా చెప్పవచ్చు. కానీ ఇది కేవలం అలెర్జీల వల్ల మాత్రమే కాదు, అనేక రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా. దానికి కారణమేమిటో అర్థం చేసుకుని దానికి సరైన చికిత్స చేయడం వల్ల కళ్ళ ఆరోగ్యాన్ని..

Itchy Eyes: కంటి దురద ఈ వ్యాధికి ప్రారంభ సంకేతం.. బీ కేర్ ఫుల్‌ బ్రదర్‌!
Itchy Eyes

Updated on: May 08, 2025 | 9:15 PM

ఇటీవలి కాలంలో కళ్ళు దురద సాధారణ సమస్యగా మారింది. వేసవి, శీతాకాలంలో పొడి గాలితోపాటు దైనందిన జీవనశైలి అలవాట్లు కంటి అసౌకర్యానికి కారణంగా చెప్పవచ్చు. కానీ ఇది కేవలం అలెర్జీల వల్ల మాత్రమే కాదు, అనేక రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా. దానికి కారణమేమిటో అర్థం చేసుకుని దానికి సరైన చికిత్స చేయడం వల్ల కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కళ్ళు దురదకు కారణమేమిటి? వాటిని నివారించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

అలెర్జీ

దుమ్ము లేదా ఇతర అలెర్జీ కారకాలు కళ్ళలో దురద, ఎరుపు, నీరు కారడానికి కారణమవుతాయి.

పొడి కళ్ళు

కళ్ళు తగినంత నీటిని ఉత్పత్తి చేయనప్పుడు లేదా కన్నీళ్లు చాలా త్వరగా పొడి బారినప్పుడు దురదగా మారుతాయి. స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం, ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించడం లేదా తక్కువ తేమ ఉన్న వాతావరణంలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు.

ఇవి కూడా చదవండి

కంటి ఇన్ఫెక్షన్

కండ్లకలక వంటి బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు దురద, కళ్ళు ఎర్రబడటానికి కారణమవుతాయి.

కాంటాక్ట్ లెన్సులు

కాంటాక్ట్ లెన్స్‌లను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, ఎక్కువసేపు వాటిని ధరించడం వల్ల కళ్ళు దురద లేదా అసౌకర్యంగా ఉంటాయి.

పర్యావరణ కారకం

కాలుష్యం, పొగ లేదా ఇతర రసాయనాలు కళ్ళను చికాకు కలిగిస్తాయి. వేసవి ఎండ వేడి లేదా శీతాకాలపు చల్లని గాలి కళ్ళ చికాకు, దురదకు కారణమవుతాయి.

మందుల దుష్ప్రభావాలు

కొన్ని మందులు కళ్ళు ఎండిపోయి దురదకు కారణమవుతాయి. బ్లెఫారిటిస్ (కనురెప్పల వాపు), తామర లేదా థైరాయిడ్ సంబంధిత సమస్యలు కూడా కళ్ళ దురదకు కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో డయాబెటిస్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా కళ్ళను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు వేడి వస్తువులను తిన్న తర్వాత కూడా దురద, కళ్ళు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సందర్భంలో పుష్కలంగా నీరు తాగడం, టీ- కాఫీ వంటి పానీయాలు తీసుకోకపోవడం మంచిది. సమస్య తీవ్రమైతే వైద్యుడిని తప్పనిసరిగా కలవాలి.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.